Site icon HashtagU Telugu

BJP-TDP-JSP Joint Meeting : ఈ నెల 17 న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ..?

March 17 Modi

March 17 Modi

మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకున్నది సాధించాడు. మొదటి నుండి బిజెపి తో పొత్తు (BJP-TDP Alliance) పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాలని చూసిన పవన్..ఇప్పుడు అనుకున్నట్లే బిజెపి – టీడీపీ తో కలిసి బరిలోకి దిగబోతున్నాడు. గత మూడు రోజులుగా ఢిల్లీ లో బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి..ఫైనల్ గా పొత్తుకు ఓకే చేయించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలపై బీజేపీ (BJP) దృష్టిసారించింది. ఎక్కువ సీట్లు అడగడంతో చర్చలు సుధీర్ఘంగా కొనసాగాయి. బీజేపీ, జనసేనకు 30 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 145 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా.. 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ, జనసేనలకు ఇచ్చేందుకు టీడీపీ ప్రాథమికంగా అంగీకరించింది. 8 సీట్లలో బీజేపీ ఆరు చోట్ల బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ గురించి బీజేపీ అంతగా పట్టించుకోవడం లేదు. లోక్ సభ సీట్లపై మాత్రం దృష్టిసారించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పొత్తు ఖరారు కాగానే చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన వస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని.. వారికి అధికారంలోకి రాగానే ముఖ్య పదవులు ఇస్తామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. పొత్తులపై క్లారిటీ వచ్చిన ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు చంద్రబాబు. సర్వేల ఆధారంగా ఏ పార్టీ నుంచి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చలు జరిపి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17 న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు ప్రధాని మోడీ (PM Modi) ముఖ్య అతిథిగా వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మోడీ పాల్గొనే సభకు ఒకరోజు అటు ఇటు అయినా సభ ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని చంద్రబాబు ముఖ్య నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది.

Read Also : BJP Alliance in AP : బిజెపి – టీడీపీ కూటమి పొత్తు ఫై వైసీపీ నేతల సెటైర్లు..