BJP Target Congress: ‘కాంగ్రెస్ వార్’ పై బీజేపీ గురి.. అసంతృప్తులకు ఆహ్వానం!

తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న కుమ్ములాటను బీజేపీ (BJP) నిశితంగా పరిశీలిస్తోంది!

  • Written By:
  • Updated On - December 19, 2022 / 03:22 PM IST

బీజేపీ (BJP), బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఎన్నికల సమరంలోకి దూసుకుపోతుంటే, తెలంగాణ కాంగ్రెస్ (TCongress) మాత్రం ఇందుకు విరుద్దంగా అంతర్గత కుమ్ములాటలు, విబేధాలు, గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోంభం ఇష్యూ ఇతర పార్టీలకు వరంగా మారనుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణపై గురిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కుమ్ములాటలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది బీజేపీ పార్టీ.

తెలంగాణ కాంగ్రెస్ (TCongress) లో టీసీసీసీ చీఫ్ రేవంత్, సీనియర్లకు ఏమాత్రం పడటం లేదు. ఆది నుంచి ఈ వర్గాల మధ్య విభేదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక ఓటమి కాంగ్రెస్ పతనాన్ని ప్రశ్నిస్తుండటంతో తాజాగా కొత్త కమిటీల చిచ్చు ఏకంగా సంక్షోభానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే మంచిదని హితబోధ పలికారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా బీజేపీ పార్టీలో చేరాలని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) పిలుపునిచ్చారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేవంత్ వ్యవహార శైలిని విమర్శించేందుకు ఉత్తమ్, భట్టి విక్రమార్క ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ఇన్ని రోజులు రేవంత్ బ్లాక్ మెయిలర్ అని, బ్రోకర్ అని చెబుతున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయగా, ఒకవేళ రేవంత్ కు అవకాశం ఇస్తే, రేవంత్ తెలంగాణను అమ్మేస్తారని అన్నారు. ప్రజల కోసం పోరాడిన చరిత్ర ఆయనకు లేదు అని రాజగోపాల్ (Rajagopal) అన్నారు. ‘‘తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోదీ నాయకత్వంలో కలిసి పని చేద్దాం’’ కాంగ్రెస్ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ఒకవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోదీతో భేటీ కావడం, మరోవైపు రాజగోపాల్ కాంగ్రెస్ సంక్షోంభం వ్యాఖ్యలు చేయడం తెలంగాణ (Telangana) రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. కాగా కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలతో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ రహస్యంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరే నేతలను బండి సంజయ్‌ రేపు ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకీ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వలస వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారు అన్న సీనియర్ ల ఆరోపణలతో టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి,సీతక్క, విజయ రామారావు, చారగొండ, వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేష్ తో పాటు పలువురు నేతలు రాజీనామా చేశారు. కాగా రాజీనామా చేసిన నేతలు అందరూ వారి రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కు పంపిన విషయం తెలిసిందే.

Also Read: Roja Boxing: బాక్సింగ్ రింగ్ లో రోజా పంచులు.. వీడియో వైరల్!