Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్ తోపాటు వాళ్లందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయిస్తాం..!!

మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. యాదాద్రిలో సంజయ్ ప్రమాణం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ నోళ్లకు సంప్రోక్షణ చేస్తే […]

Published By: HashtagU Telugu Desk
Telangana BJP

Sanjay bandi

మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. యాదాద్రిలో సంజయ్ ప్రమాణం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ నోళ్లకు సంప్రోక్షణ చేస్తే బాగుంటుందన్నారు. తప్పు చేసిన వాళ్ల తడిబట్టలతో గుడిలోకి ప్రవేశించరన్నారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సంజయ్…యాదాద్రి నరసింహాస్వామి చాలా పవర్ ఫుల్ అని…తాను ప్రమాణం చేయడంతో బీజేపీ నిజాయితీ దేశ ప్రజలందరికీ తెలిసిందన్నారు. కేటీఆర్ దేవుళ్లను నమ్మడు…అలాంటివ వాళ్లు దేవుడు గురించే మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు.

కాగా తెలంగాణలో మొత్తం 16 ఎమ్మెల్యేలు, మంత్రులు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని ఆరోపించారు సంజయ్. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ తోపాటు మిగతా ఎమ్మెల్యేలకు డ్రగ్స్ పరీక్షలు చేయిస్తామన్నారు. అప్పుడు తెలుస్తుంది డ్రగ్స్ కు బానిసలెవ్వరనేది. డ్రగ్స్ బానిసలు మాగురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.

  Last Updated: 29 Oct 2022, 06:53 PM IST