BJP slogan : కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు జంపింగ్ ముద్ర‌, గెలిపించినా బీఆర్ఎస్ లోకే..!

కాంగ్రెస్ పార్టీ మీద అప‌న‌మ్మకం ఉంది. ఆ పార్టీ త‌ర‌పున గెలిచిన‌ప్ప‌టికీ అధికార‌పార్టీలోకి వెళ్లిపోతార‌ని(BJP slogan) వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 04:35 PM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం మీద అప‌న‌మ్మకం ఉంది. ఆ పార్టీ త‌ర‌పున గెలిచిన‌ప్ప‌టికీ అధికార‌పార్టీలోకి వెళ్లిపోతార‌ని(BJP slogan) స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, ఇప్పుడు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఆ కోణాన్ని అందుకున్నారు. ప్ర‌స్తుతం బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయిన వేళ మ‌ళ్లీ పెంచుకునే గేమ్ ప్రారంభించారు. మూడేళ్ల పాటు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో బీజేపీని కొంత మేర‌కు లేపిన బండి ప్ర‌య‌త్నం ఢిల్లీ పెద్ద‌ల ఫిక్సింగ్ తో మ‌స‌క బారింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత‌ను (Kavitha) అరెస్ట్ చేస్తామ‌ని ఊరువాడా చెప్పిన బీజేపీ ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ తెర‌వెనుక రాజ‌కీయం కాంగ్రెస్ చెప్పిన విధంగా ఉంద‌ని ప్ర‌జ‌లు ఫిక్స్ అయ్యారు. ఆ విష‌యాన్ని స‌ర్వేల ద్వారా ఇటీవ‌ల బీజేపీ తెలుసుకుంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం మీద అప‌న‌మ్మకం (BJP slogan)

ప్ర‌తిగా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టింది. స‌హ‌జ బ‌ల‌హీన‌తను గ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ మీద త‌గిన‌ (BJP slogan)అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది. తెలంగాణ సీఎం కోవ‌ర్ట్ లు కాంగ్రెస్ పార్టీలో మ‌స్తుగా ఉన్నార‌ని బండి సంజ‌య్ తాజాగా చేసిన ఆరోప‌ణ‌. క‌నీసం 30 మంది అభ్య‌ర్థుల‌కు పెట్టుపెట్ట‌బోతున్నార‌ని చెబుతున్నారు. ఒక వేళ గెలిస్తే వాళ్లు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతార‌ని స్లోగ‌న్ అందుకున్నారు. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను న‌మ్మ‌డానికి ఆధారాలు లేక‌పోలేదు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతార‌ని స్లోగ‌న్

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఏకంగా అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది. మునుగోడు త‌ర‌హాలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవ‌డానికి కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ని బండి భావ‌న‌. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్య‌ర్థికి ఎక్కువ‌గా ఓట్లు ప‌డితే, బీఆర్ఎస్ అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌చ్చ‌ని మునుగోడులో కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌గా చెబుతున్నారు. అందుకే, క‌నీసం 20 నుంచి 30 కోట్ల వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి స‌మ‌కూర్చార‌ని అప్ప‌ట్లో బీజేపీ నుంచి ఓడిపోయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ చేసిన ఆరోప‌ణ‌. ఇదే ఆరోప‌ణ‌ను ఈటెల రాజేంద్ర ఇటీవ‌ల చేస్తూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ వ‌ద్ద డీల్ (BJP slogan)కుదుర్చుకున్నార‌ని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు తెర‌మీద‌కు (BJP slogan)

ప్ర‌స్తుతం 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వాళ్లు ఉన్నారు. అంతేకాదు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలిచిన వాళ్లు అనేక మంది కాంగ్రెస్ లీడ‌ర్లు అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. ఇలాంటివ‌న్నీ చూసిన త‌రువాత కాంగ్రెస్ అభ్య‌ర్థ‌లకు ఒటేసిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతార‌ని తెలంగాణ స‌మాజంలో బ‌లంగా ఉంది. అందుకే, బండి సంజ‌య్ ఇదే స్లోగ‌న్ ను కాంగ్రెస్ మీద విసిరారు. రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీ మాత్ర‌మేనంటూ(BJP slogan) చెబుతున్నారు. ఆయ‌న చెబుతోన్న దానికి అనుగుణంగా పీసీసీ చీఫ్ తాజా స‌ర్వే నుంచి ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు చేసిన కామెంట్స్ ఉన్నాయ‌ని చెప్ప‌డానికి బోలెడు ఆధారాలు ఉన్నాయి.

90 స్థానాల్లో గెలవ‌లేక‌పోతే ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయ‌డం క‌ష్ట‌మ‌ని

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా, ఐ ప్యాక్ ఫౌండ‌ర్ పీకే క‌లిసిన సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు దిగ్విజ‌య్ సింగ్‌, కేసీ వేణుగోపాల్ త‌దిత‌రులు పొత్తు అంశంపై సంకేతాలు ఇచ్చారు. ఇక రాష్ట్రంలోని సీనియ‌ర్లు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జానారెడ్డి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అనే అంశాన్ని లీక్ చేశారు. అయితే, ఎన్నిక‌ల‌కు ముందుగానా? త‌రువాత ఉంటుందా? అనేది మాత్రం సందిగ్ధం. దానికి బ‌లం చేకూరేలా పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవ‌ల చేసిన కామెంట్ ఉంది. క‌నీసం 90 స్థానాల్లో గెలవ‌లేక‌పోతే ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు. మ్యాజిక్ ఫిగ‌ర్ 60 కాగా, ఒక వేళ అటూఇటూ ఎమ్మెల్యేల సంఖ్య. ఉంటే జంప్ అవుతార‌ని ఆయ‌న అభిప్రాయం.

Also Read : BRS Sitting MLAs: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే దమ్ము కేసీఆర్ కి ఉందా?

తాజాగా రేవంత్ రెడ్డి చెబుతోన్న స‌ర్వే ప్ర‌కారం బీఆర్ఎస్ కు 45 స్థానాలు, కాంగ్రెస్ కు 45 స్థానాలు, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 స్థానాలు గెలుచుకోవ‌డానికి అనువుగా ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. నువ్వా? నేనా? అన్న‌ట్టు 15 స్థానాల్లో పోటీ ఉంటుంద‌ని చెబుతున్నారు. అంటే, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేద‌ని స‌ర్వే సారాంశం. అలాంటి సంద‌ర్భంలో భావ‌సారూప్య‌త ఉన్న బీఆర్ఎస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ సిద్ద‌ప‌డుతుంది. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌ల నుంచి తెలంగాణ సీనియ‌ర్ల వ‌ర‌కు చెబుతున్నారు. అందుకే, బండి సంజ‌య్ ఇలాంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు, ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతార‌ని(BJP slogan) స్లోగ‌న్ అందుకున్నారు. ఇది, ప‌డిపోయిన గ్రాఫ్ ను పెంచుతుంద‌ని బీజేపీ న‌మ్ముతోంది.

Also Read : T BJP : గ్రూప్ ల‌పై సోషల్ మీడియా హోరు! త‌రుణ్ చుక్ ఫుల్ స్టాప్‌!!