BJP Sketch: బీజేపీ స్కెచ్.. కేసీఆర్ పై పోటీకి అభ్యర్థి ఫిక్స్!

బీజేపీ అధినాయకత్వం కేసీఆర్ పై బిగ్ స్కెచ్ వేసింది. ఆయనపై పోటీకి సరైన అభ్యర్థిని ఫిక్స్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - December 7, 2022 / 01:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల కోసం బీజేపీ (BJP) ఇప్పటి నుంచే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడిందా? కెసిఆర్ (KCR)పై పోటీ చేయడానికి సమవుజ్జీని బీజేపీ ఇప్పటికే నిర్ణయం చేసిందా? ఈమేరకు చాపకింద నీరులా బీజేపీ పని కూడా మొదలు పెట్టిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) ను బలంగా ఢీ కొట్టాలని, వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ విజయ కేతనం ఎగురవేయాలని నిర్ణయించిన బిజెపి అధినాయకత్వం కెసిఆర్ పై పోటీకి అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. కెసిఆర్ పై సమవుజ్జీ ని పోటీలో పెట్టాలని, మమతపై గత ఎన్నికల సమయంలో బెంగాల్ ప్లాన్ అమలు చెయ్యాలని భావిస్తుంది. ఇందులో భాగంగా తీసుకున్న నిర్ణయంతో ఈటల రాజేందర్ ను కెసిఆర్ పై ఎన్నికల బరిలోకి దించడానికి బీజేపీ (BJP) హైకమాండ్ డిసైడ్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక ఈ మేరకు ఈటల రాజేందర్ కూడా కెసిఆర్ పై పోటీ చేయడానికి అధినాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే గతంలోనే ఈటల రాజేందర్ కెసిఆర్ పై పోటీ చేస్తానని ప్రకటన చేశారు. కెసిఆర్ గజ్వేల్ లో పోటీ చేసినా, మరోచోట పోటీ చేసినా తాను రెడీ అంటూ ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇక ఇటీవల కొన్ని రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ని ఎదుర్కోవడం ఎలాగో బ్లూ ప్రింట్స్ కూడా తీసుకున్నట్టు సమాచారం. కెసిఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తే గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీచేయడానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తారా లేదా నియోజకవర్గం మారతారా అన్నది కొంతకాలం కిందట చర్చ జరిగినప్పటికీ, ప్రస్తుతం దానిపైన మళ్లీ ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న బీజేపీ, గజ్వేల్ లో కెసిఆర్ ని ఎదుర్కొనే బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి సరైన అభ్యర్థిగా అక్కడ ఉంటారని కూడా చర్చ జరుగుతుంది.

ఇక ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో గజ్వేల్ నియోజకవర్గం పై దృష్టి సారించారు. తరచూ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్, అక్కడ చేరికలు ప్రోత్సహిస్తూ పని మొదలు పెట్టారు. బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం కోసం , మమతకు ఒకప్పటి ప్రధాన అనుచరుడు అయిన సువెందు అధికారిని నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దించినట్టు, ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన , గతంలో కెసిఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ పై పోటీకి నిలబెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి ఎన్నికలు సీఎం కేసీఆర్ కు టఫ్ ఎన్నికలని, ఆ మేరకు బీజేపీ ఇప్పటినుంచే తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పుతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ నిలబడితే తెలంగాణ రాష్ట్రంలో వారు జోర్దార్ గా సాగుతోందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి కేసీఆర్ (CM KCR) గజ్వేల్ నుండే ఎన్నికల బరిలోకి దిగుతారా? లేదా నియోజకవర్గం మారతారా? అన్నది తెలియాల్సి ఉంది.

Aslo Read: KCR BRS Strategy: పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో ‘బీఆర్ఎస్’ సమరం