CS Somesh Kumar : కేసీఆర్ పై బీజేపీ తొలి విజ‌యం! సీఎస్ గా సోమేష్ ఔట్‌?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు సంబంధించిన ఆప‌రేష‌న్ బీజేపీ షురూ చేసిన‌ట్టు అర్థం అవుతోంది.

  • Written By:
  • Updated On - July 9, 2022 / 01:03 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు సంబంధించిన ఆప‌రేష‌న్ బీజేపీ షురూ చేసిన‌ట్టు అర్థం అవుతోంది. తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేష్ కుమార్ ను ఏపీకి పంపించే ప్ర‌య‌త్నం మొద‌లైయింది. మాయ‌ల‌ప‌కీర్ ప్రాణం చిల‌క‌లో ఉన్న‌ట్టు కేసీఆర్ గెలుపు సోమేష్ కుమార్ చుట్టూ తిరుగుతోంది. ఆయ‌న్ను ఢిల్లీ లాబీయింగ్ ద్వారా డిప్యూటేష‌న్ మీద తెలంగాణ‌లోనే నియ‌మించుకోవ‌డంలో కేసీఆర్ వ్యూహం ఉంది. ఆ విష‌యాన్ని అప్ప‌ట్లోనే కాంగ్రెస్ నేత‌లు లేవ‌నెత్తారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ క్యాడ‌ర్ ఐఏఎస్ ల కోటా కింద సోమేష్ కుమార్ ను కేటాయించారు. కానీ, సెంట్ర‌ల్ ట్రిబ్యున‌ల్ ద్వారా తెలంగాణ‌లోనే కొన‌సాగించేలా కేంద్రంతో కేసీఆర్ ఆప్ప‌ట్లో లైజ‌నింగ్ చేశార‌ని టాక్‌. ఆ విష‌యాన్ని ప్ర‌త్య‌ర్థులు ప‌దేప‌దే చెబుతుంటారు. ఏపీ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ ను తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ చేయ‌డం వెనుక ఎన్నిక‌ల వ్యూహం ఉంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎన్నో ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు.

అప్ప‌ట్లో ఏడు నెలల సర్వీస్ మిగిలి ఉన్న మిస్టర్ అజయ్ మిశ్రా (1984 బ్యాచ్) కాకుండా చీఫ్ సెక్ర‌ట‌రీగా సోమేష్ కుమార్ ను నియ‌మించ‌డం ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంది. 1983 నుండి 1998 వరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఆఫ్ బ్యాచ్‌ల అధికారుల నుండి సోమేష్ కుమార్‌ను సీఎస్ గా నియ‌మించారు. సుదీర్ఘ కాలంగా పాటు (జనవరి 1, 2020 నుండి నాలుగు సంవత్స‌రాలు) ప‌ద‌విని కలిగి ఉంటారు. డిసెంబర్ 31, 2023 వరకు సోమేష్ కుమార్‌కు సుదీర్ఘకాలం పాటు సేవ చేసే అవ‌కాశంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఆయ‌న్ను ఇక్క‌డే ఉంచాల‌ని కేసీఆర్ ప్లాన్ చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న్ను తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీగా తొలగించే ప్రక్రియ‌ను బీజేపీ మొదలు పెట్టింది. ఇప్ప‌టికే వివిధ అంశాల‌పై కాంగ్రెస్, బీజేపీ ఆయ‌న మీద ఫిర్యాదులు చేశాయి. వాటిని సెంట్ర‌ల్ ట్రిబ్యున‌ల్ కు అందించ‌డంతో పాటు స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై కూడా ఫిర్యాదు ఉన్నాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌రువాత స‌హ‌జంగా యంత్రాంగం అంతా చీఫ్ సెక్ర‌ట‌రీ ఆధీనంలోకి వెళ్లిపోతోంది. అప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులు చెప్పిన‌ట్టు ఎవ‌రూ న‌డుచుకోరు. కేవ‌లం ఎన్నిక‌ల క‌మిష‌న్ కు క‌ట్టుబ‌డి ప‌నిచేయాలి. అందుకే, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సోమేష్‌కుమార్ ఉంటే సానుకూలంగా అన్ని ప‌నుల‌ను ఎన్నిక‌ల్లో చ‌క్క‌బెట్టుకోవ‌చ్చ‌ని కేసీఆర్ ఎత్తుగ‌డ‌.

అధికారం కోసం దూకుడుగా వెళుతోన్న బీజేపీ సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ స‌భ త‌రువాత మ‌రింత వేగాన్ని పెంచింది. ఆ క్ర‌మంలోనే కేంద్రం నుంచి సోమేష్ కుమార్ ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేసింది. అంతేకాదు, హైకోర్టులోనూ ఆయ‌న‌కు ప్ర‌స్తుతం చుక్కెదురు అయింది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆయ‌న్ను ఏపీకి పంపాల‌ని ఆదేశించింది. కేంద్ర సివిల్ స‌ర్వీసుల ట్రిబ్యున‌ల్ కూడా అదే చెబుతోంది. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కుడిభుజంగా ఉంటార‌నుకున్న సోమేష్‌ఖ కుమార్ ను తెలంగాణ నుంచి పంపేయ‌డంలో బీజేపీ విజ‌యం సాధిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక వేళ అదే , జ‌రిగితే వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగా ఎన్నిక‌లు జ‌రిగే ఛాన్స్ ఉండ‌దని స‌చివాల‌య‌వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.