Munugode Post Mortem: `కోమ‌టిరెడ్డి` కి బీజేపీ పెద్ద‌ల వెన్నుపోటు?

తెలంగాణ బీజేపీలో కోవ‌ర్ట్ రాజ‌కీయం కాంగ్రెస్ పార్టీని మించిపోయిందా? అందుకే, మునుగోడులో రాజ‌గోపాల్ రెడ్డి ఓడిపోయారా? పోలింగ్ రోజుకు ముందు రెండు రోజులు ఏమి జ‌రిగింది? అనేది దానిపై త‌రుణ్ చుక్ ఆరా తీస్తున్నారా? అంటే ఔనంటూ బీజేపీలోని కోర్ టీమ్ స‌భ్యులు కొంద‌రు చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 01:06 PM IST

తెలంగాణ బీజేపీలో కోవ‌ర్ట్ రాజ‌కీయం కాంగ్రెస్ పార్టీని మించిపోయిందా? అందుకే, మునుగోడులో రాజ‌గోపాల్ రెడ్డి ఓడిపోయారా? పోలింగ్ రోజుకు ముందు రెండు రోజులు ఏమి జ‌రిగింది? అనేది దానిపై త‌రుణ్ చుక్ ఆరా తీస్తున్నారా? అంటే ఔనంటూ బీజేపీలోని కోర్ టీమ్ స‌భ్యులు కొంద‌రు చెబుతున్నారు.

మునుగోడు ప్ర‌చారానికి క్ల‌స్ట‌ర్ల వారీగా కొంద‌రు సీనియ‌ర్ల‌ను ముందుగానే బీజేపీ నియ‌మించింది. పోలింగ్ రెండు రోజుల ముందు వ‌ర‌కు అర‌మ‌రిక‌లు లేకుండా ప్ర‌చారం చేశారు. కానీ, రాజ‌గోపాల్ రెడ్డి గెలిస్తే, బీసీల‌కు ప్రాధాన్యం పోతుంద‌ని కొంద‌రు భావించార‌ట‌. అందుకే, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర‌, బండి సంజ‌య్, అర‌వింద్ కుమార్ గౌడ్ త‌దిత‌రులు చివ‌రి రెండు రోజులు సైలెంట్ అయ్యార‌ని రాజ‌గోపాల్ రెడ్డి అభిమానుల అనుమానం. ఓడిపోవ‌డానికి కార‌ణాల‌ను అన్వేషిస్తోన్న రాజ‌గోపాల్ రెడ్డి టీమ్ కు వెన్నుపోటు రాజ‌కీయం వెలుగుచూసింద‌ని టాక్‌. డ‌బ్బు పంపిణీకి సంబంధించిన స‌మాచారాన్ని పోలీసుల‌కు లీకు చేసింది కూడా బీజేపీలోని లీడ‌ర్లే అనే విష‌యాన్ని ఆల‌స్యంగా కోమ‌టిరెడ్డి వ‌ర్గం గ్ర‌హించిందట‌.

Also Read:  YS Sharmila : మోడీ వ‌ద్ద‌కు `కాళేశ్వ‌రం` అక్ర‌మాలు! ష‌ర్మిల భేటీ?

గౌడ్‌, ముదిరాజ్ ఓట్లు ఎక్కువ‌గా ఉండే మునుగోడులో అర‌వింద్ కుమార్ గౌడ్ ను స‌రైన విధంగా ఉప‌యోగించుకోవ‌డంలోనూ రాజ‌గోపాల్ రెడ్డి ఫెయిల్ అయ్యార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఈటెల‌, బండి సంజ‌య్ ఇద్ద‌రూ గౌడ్, ముదిరాజ్ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని బీజేపీలోని ఒక గ్రూప్ భావ‌న‌. పోలింగ్ కు రెండు రోజులు ముందు క్షేత్ర‌స్థాయి పరిస్థితి ఆశాజ‌న‌కంగా లేద‌ని బీజేపీ అధిష్టానంకు ఒక వేదిక‌ను బండి అండ్ టీమ్ అంద‌చేసింద‌ని తెలుస్తోంది. ఆ కార‌ణంగా అక్టోబ‌ర్ 31వ తేదీన జ‌ర‌గాల్సిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా బ‌హిరంగ స‌భ ర‌ద్దు అయింద‌ని రాజ‌గోపాల్ రెడ్డి వ‌ర్గం భావిస్తోంది.

పోలింగ్ కు రెండు రోజులు ముందు జ‌రిగిన డ‌బ్బు పంపిణీ లీకులు, ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఇచ్చిన నివేదిక మునుగోడులో రాజ‌గోపాల్ రెడ్డి విజ‌యాన్ని దెబ్బ‌తీశాయ‌ని కోమ‌టిరెడ్డి నిర్థార‌ణ వ‌స్తున్నార‌ట‌. అంతేకాదు, బీజేపీ అధిష్టానం కూడా ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను స‌మీక్షిస్తుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బండి వ‌ర్సెస్ కొంద‌రు క‌రీంనగ‌ర్ నేత‌ల మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. ఆయ‌న మీద ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. మ‌రో వైపు డీకే అరుణ అండ్ టీమ్ కూడా బండి సంజ‌య్ మీద గుర్రుగా ఉంద‌ని వినికిడి. అంటే, రెడ్డి వ‌ర్సెస్ బీసీ గ్రూపుల మ‌ధ్య‌ బీజేపీలో అంత‌ర్గ‌త పోరు జ‌రుగుతుంద‌ని అధిష్టానం గుర్తించింద‌ని తెలుస్తోంది. దీనికి వెంట‌నే ప‌రిష్కారం తీసుకురాక‌పోతే రాజ్యాధికారం తెలంగాణ‌లో అంద‌ని ద్రాక్ష‌గా మారుతుంద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బీజేపీలోని రెడ్డి సామాజిక‌వ‌ర్గం ప్రత్యామ్నాయ మార్గాల‌ను చూసుకుంటుంద‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. అదే నిజం అయితే, మ‌ళ్లీ కాంగ్రెస్ క‌ళ‌క‌ళ‌లాడే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read:  CM Jagan : ఐటీసీతో జ‌గ‌న్ `స్పైసీ ` అడుగు