Operation Akarsh: ఢిల్లీ ఆప‌రేష‌న్ షురూ

బీజేపీ `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్` తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్దగా ప్ర‌భావం లేదు. ఇటీవ‌ల పార్టీలోని చేరిన కొండా విశ్వేర‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీ వేసిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితం క‌నిపించ‌డంలేదు.

  • Written By:
  • Updated On - August 2, 2022 / 04:22 PM IST

బీజేపీ `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్` తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్దగా ప్ర‌భావం లేదు. ఇటీవ‌ల పార్టీలోని చేరిన కొండా విశ్వేర‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీ వేసిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితం క‌నిపించ‌డంలేదు. అందుకే, ఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఆ క్ర‌మంలో డీకే అరుణ‌, ఈటెల రాజేంద్ర మంగ‌ళ‌వారం ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే లీడ‌ర్ల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. ఉద్య‌మ‌కారులు, ఇత‌ర పార్టీల్లోని అసంతృప్తి వాదుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌త్యేకించి కేసీఆర్ పై ఆగ్ర‌హంగా ఉన్న కీల‌క తెలంగాణ ఉద్య‌మకారుల‌ను బీజేపీ వైపు తీసుకొచ్చే బాధ్య‌త‌ల‌ను ఈటెల‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఇక మ‌హ‌బూబ్ న‌గ‌ర్ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న రేవంత్ రెడ్డిని దెబ్బ‌తీసేలా బీజేపీ అప‌రేష‌న్ ను డీకే అరుణ‌కు ఇచ్చార‌ని స‌మాచారం. అందుకే, ఈటెల‌, డీకే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో స‌మావేశం అయిన‌ట్టు వినికిడి.

Also Read:  AP Classes Merger: ఒక వ‌ర్గం మీడియాపై జ‌గ‌న్ బాట‌న ఏపీ విద్యాశాఖ

ప్ర‌జాసంగ్రామ యాత్ర‌ను మూడో విడ‌త బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ప్రారంభించారు. యాదాద్రి నుంచి ప్రారంభించిన ఆ యాత్ర ను అనుస‌రించి చేరిక‌లు భారీగా ఉండాల‌ని బీజేపీ దిశానిర్దేశం చేస్తోంది. అంతేకాకుండా ఇత‌ర పార్టీల సీనియ‌ర్ల‌ను ఢిల్లీ కేంద్రంగా చేర్చుకోవాల‌ని సూచిస్తోందట‌. త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు ఇద్ద‌రు, 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్ల‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ల‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని డీకే, ఈటెల భేటీలు తెలంగాణ బీజేపీ చేరిక‌ల‌పై సీరియ‌స్ గా కొన‌సాగుతున్నాయ‌ని స‌మాచారం.

Also Read:  TDP@NDA: ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లే వేళాయే!

తెలంగాణ కీల‌క నేత‌లు డీకే అరుణ‌, ఈట‌ల రాజేంద‌ర్‌లు సోమ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకున్నారు. సోమ‌వారం ఇద్ద‌రు నేత‌లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం ఈట‌ల రాజేంద‌ర్‌, డీకే అరుణ‌లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌తో భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు బీజేపీలో చేరే విష‌యంపై ఈ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈటెల‌, డీకే ఢిల్లీ టూర్ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.