BJP ‘Razakar Files’: తెలంగాణ లక్ష్యంగా బీజేపీ ‘రజాకార్ ఫైల్స్’.. శరవేగంగా షూటింగ్!

తెలంగాణలో వచ్చే ఎన్నికలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - November 19, 2022 / 04:02 PM IST

తెలంగాణలో వచ్చే ఎన్నికలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందుకే ప్రజాక్షేత్రంలో ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై మరొకరు విమర్శలు, మాటల తూటాలకు దిగుతున్నారు ఆ పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను అస్త్రంగా చేసుకొని బీజేపీ సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీ తో ముందుకు రానుంది. నగర శివార్లలోని ఒక స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం ‘రజాకార్’. రజాకార్ల చేతుల్లో హైదరాబాద్ ప్రజలు, హిందువులు, అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చరిత్రను పునర్నిర్మించడమే కాకుండా ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో తెరకెక్కుతోంది.

ఇటీవల జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాలు బిజెపి, టిఆర్ఎస్, ఎఐఎంఐఎం మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిన విషయం తెలిసిందే. బీజేపీ సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరుపుకోగా, టిఆర్‌ఎస్ – ఎంఐఎం సమైక్యవాద దినోత్సవంగా, కాంగ్రెస్ విడివిడిగా జరుపుకున్నాయి. అయితే దశాబ్దాల కాలంగా సినిమాలు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాయి. ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలిత లాంటివాళ్లు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బయోపిక్స్ కూడా రాజకీయాలకు మైలేజీ ఇస్తున్నాయి.

Also Read:  T-Congress: రేవంత్ రెడ్డి దెబ్బ‌, బీజేపీ గూటికి మ‌ర్రి?

“ది కాశ్మీర్ ఫైల్స్ విజయం తర్వాత పొలిటికల్ పార్టీలు సినిమాలపై ద్రుష్టిసారిస్తున్నాయి. “కశ్మీర్ ఫైల్స్ అనేది భారతీయ చలనచిత్రాలలో ఓ ప్రత్యేకమైన మూవీ. రజాకార్ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది”అని వర్మ అన్నారు. దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని సృష్టించారు. సెట్‌లో మొత్తం 19 షెడ్యూల్‌లలో ఐదవ షెడ్యూల్‌లో కొంత భాగాన్ని షూట్ చేస్తున్నారు. రజాకార్లు ఒక చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆమె తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ, ఫలించలేదు. గ్రామస్థులు ఏడుస్తూ విధిని నిందించారు. ఇలాంటి సీన్స్ ఇప్పుడు తెరకెక్కుతున్నాయి.

“రజాకార్లు, ఆపరేషన్ పోలో, నిజాం పాలన చివరి రోజుల్లో జరిగిన దురాగతాలు, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరోచిత పాత్రలు వీరోచితంగా ఉంటాయని” అని గూడూరు చెప్పారు. సమరవీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. సిటీ శివారులో “గుండ్రాంపల్లి గ్రామంలో కీలకమైన ఘటనలను షూట్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో రజాకార్స్ ఫైల్స్ సినిమాగా తెరకెక్కుతుండటం ఆసక్తిని రేపుతోంది.

Also Read:  Revanth Reddy: ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్.. ప్రత్యేక కార్యాచరణలో రేవంత్!