Telangana Politics : తెలంగాణలో బెంగాల్ ఫార్ములా

తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ సీరియ‌స్ అడుగులు వేస్తోంది. రాజ్యాధికారం దిశ‌గా మోడీ, షా ద్వ‌యం తెలంగాణ అస్త్రాల‌కు ప‌దును పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 29, 2022 / 02:00 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ సీరియ‌స్ అడుగులు వేస్తోంది. రాజ్యాధికారం దిశ‌గా మోడీ, షా ద్వ‌యం తెలంగాణ అస్త్రాల‌కు ప‌దును పెడుతున్నారు. రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చిస్తూ కేసీఆర్ కు ఎప్ప‌టిక‌ప్పుడు ఆందోళ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే గ‌జ్వేల్ వ్య‌వ‌హారాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అక్క‌డ నుంచి ఈటెల రాజేంద్ర‌ను పోటీకి నిల‌పాల‌ని భావిస్తున్నారు. దీంతో ఇప్ప‌టి నుంచే కేసీఆర్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 2014, 2018 ఎన్నిక‌ల్లో సెంటిమెంట్ ను రంగ‌రించుకుని కేసీఆర్ సీఎం అయ్యారు. ఈసారి ఆ ప‌ప్పులు ఉడికే ప‌రిస్థితి లేదు. కేవ‌లం ప్రభుత్వ వ్య‌తిరేక ఓటు చీలిక‌పై ఆయ‌న భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది. ఆ విష‌యాన్ని స‌ర్వేల రూపంలో ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిషోర్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును గంప‌గుత్త‌గా పొంద‌డానికి బీజేపీ సీరియ‌స్ ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. అధికారంలోకి వ‌చ్చే పార్టీ బీజేపీ అనే సంకేతం బ‌లంగా తీసుకెళుతోంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీనం చేస్తూ వెళుతోంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ‌రైనా గెలిచిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ‌తార‌ని సూత్రీక‌రిస్తోంది. ఇదే పంథాను గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికల్లో ప్ర‌యోగించి విజ‌య‌వంతం అయింది.

ఇటీవ‌ల బెంగాల్ కేంద్రంగా జ‌రిగిన న‌ష్టాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అడుగులు వేస్తోంది. వాస్త‌వంగా టీఎంసీ నుంచి సువేందును బీజేపీ ఎన్నిక‌ల ముందుగా తీసుకుంది. ఆయ‌న ప్రాబ‌ల్యం బెంగాల్ వ్యాప్తంగా ఉంది. కానీ, మ‌మ‌త ముందుచూపుతో ఆయ‌న‌పై పోటీ చేసింది. దీంతో సువేందు అధికారి ఆయ‌న స్థానంపై దృష్టి పెట్ట‌డానికి టైమ్ స‌రిపోయింది. ఫ‌లితంగా ఆమెను ఓడించిన‌ప్ప‌టికీ బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ గెలిచింది. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని ఇప్పుడు బీజేపీ తెలంగాణ‌లో అమ‌లు చేయ‌డానికి సిద్ధం అయింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్క‌డ పోటీ చేస్తే అక్క‌డ ఈటెల‌ను ప్ర‌యోగించ‌డానికి బీజేపీ సిద్ధం అయింది. ఫ‌లితంగా కేసీఆర్ ఆయ‌న గెలుపు కోసం ఎక్కువ టైమ్ క‌ష్ట ప‌డాల్సి వ‌స్తుంది. ఫ‌లితంగా తెలంగాణ వ్యాప్తంగా ఆయ‌న స్థానాల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది. ఇదే సూత్రాన్ని బీజేపీ ఈసారి తెలంగాణ వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి ప్లాన్ చేసింది. ఆ క్ర‌మంలోనే గ‌జ్వేల్ నుంచి ఈసారి పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప‌దేప‌దే చెబుతున్నారు.అలాగే హరీష్, కేటీఆర్ లని సైతం కట్టడి చేయడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఫార్ములాని టీఆర్ఎస్ ముందుగానే క‌నిపెట్టింది.

కాంగ్రెస్ తో పాటు, బీజేపీలోని బడా నేతలకు చెక్ పెట్టాలని టీఆర్ ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లని నిలువరించాలని చూస్తున్నారు. వీరిపై బలమైన అభ్యర్ధులని పెట్టి రాష్ట్రంపై వాళ్ల ఫోక‌స్ లేకుండా చేయాలని చూస్తోంది. ఈ బెంగాల్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌కు ప‌నిచేస్తుందో చూడాలి.