Site icon HashtagU Telugu

BJP : బీజేపీ బహిరంగ సభ.. తెలంగాణ ప్రజా సమస్యలపై బీజేపీ పుస్తకం..

Etela Rajendar

Etela Rajendar

ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ(Telangana)లో పార్టీల పోరు రోజు రోజుకి పెరుగుతుంది. ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలు చేస్తున్నారు. యాత్రలు, ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) లు ఎలాగైనా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తుంటే BRS వచ్చేసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది.

ఇటీవలే బీజేపీకి కొత్త అధ్యక్షులని ప్రకటించి జోష్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో సైలెంట్ అయిపోయిన బీజేపీ ఇటీవలే మళ్ళీ పుంజుకుంటుంది. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుంది. తాజాగా బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ త్వరలో బహిరంగ సభ పెట్టబోతున్నట్టు తెలిపారు .

ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 6వ తేదిన ప్రజ సమస్యలపై బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నాం. దానికి సంబంధించిన మరిన్ని వివరాలని త్వరలోనే తెలియచేస్తాం. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలను పుస్తక రూపంలో తీసుకువస్తున్నాం. అందులో ప్రజా సమస్యలు అన్ని ఉంటాయి. 9 ఏండ్లు ప్రజలు ఎలా మోసపోయారో చెప్తాము అని అన్నారు.

 

Also Read : BRS MLAs: దమ్ముంటే సిట్టింగులకే సీటివ్వాలి: షర్మిల ఛాలెంజ్