Site icon HashtagU Telugu

BJP 100 Crore Offer: బీజేపీ 100 కోట్లు ఆఫర్ చేసింది: పైలట్ రోహిత్ రెడ్డి కామెంట్స్!

Rohit Reddy

Rohit Reddy

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో కీలక అంశాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. తాండూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఢిల్లీకి చెందిన సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన నందకిషోర్‌, తిరుపతికి చెందిన సింహయాజీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ‘కొనుగోలు’ చేసేందుకు యత్నించారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. .

బీజేపీలో చేరేందుకు సతీష్ శర్మ రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్లు రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. నంద కిషోర్ మధ్యవర్తిత్వంతో సతీష్ శర్మ, సింహయాజీ ఫామ్‌హౌస్‌కు వచ్చారు. నేను బీజేపీలో చేరకుంటే నాపై ఈడీ, సీఐబీ కేసులు పెడతామని బెదిరించారు. అంతే కాదు, సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ పోస్టులు కూడా ఇస్తామని చెప్పారని రోహిత్ రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరాలనుకునే వారికి రూ.50 కోట్లు ఆఫర్ చేశారన్నారు.

Exit mobile version