Site icon HashtagU Telugu

KCR Vs BJP : కేసీఆర్ పై బీజేపీ దండ‌యాత్ర‌

Fadnavis Nadda

Fadnavis Nadda

తెలంగాణ‌పై రాజ‌కీయ దండ‌యాత్ర‌కు బీజేపీ మ‌రింత ప‌దును పెడుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బ‌దిలీల కోసం విడుద‌ల చేసిన జీవో నెంబ‌ర్ 317కు వ్య‌తిరేకంగా పోరాడిని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జైలుకు వెళ్లాడు. ఆ రోజు నుంచి ఆయ‌న విడుద‌ల అయ్యే వ‌ర‌కు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు హ‌డావుడి చేశారు. ఆ త‌రువాత వివిధ రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు తెలంగాణ‌కు క్యూ క‌ట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఆయ‌న పాల‌నపై యుద్ధానికి దిగారు. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా, ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌, అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ సమావేశాలు నిర్వ‌హించి కేసీఆర్ ను దుయ్య‌బ‌ట్టారు. మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ మంగ‌ళ‌వారం రంగంలోకి దిగాడు.బీజేపీ ప్ర‌ముఖుల హ‌డావుడితో తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయం వేడెక్కింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డానికి స‌ర్వ‌శ‌క్తుల‌ను బీజేపీ ఉప‌యోగిస్తోంది. అంత‌ర్గ‌త గ్రూప్ ల‌తో స‌త‌మ‌తం అవుతోన్న కాంగ్రెస్ ప్లేస్ ను భ‌ర్తీ చేయ‌డానికి వ్యూహాత్మ‌కంగా క‌మ‌ల‌ద‌ళం దూకుడు పెంచింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ చేసిన పోరాటం జైలు, బెయిల్ వ‌ర‌కు వెళ్లింది. తెలంగాణ హైకోర్టు జనవరి 5న బండికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సీఎం కేసీఆర్ విప‌క్షాల‌పై అణచివేత ధోర‌ణిని నిర‌సిస్తూ బీజేపీ ఆందోళ‌న కొన‌సాగిస్తోంది.

Also Read : ఢిల్లీ పీఠంపై కోల్డ్ వార్‌

హుజురాబాద్ ఫ‌లితాల త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రెండు వారాల పాటు యుద్ధం న‌డిచింది. పార్ల‌మెంట్ లోప‌ల‌, వెలుప‌ల ప‌ర‌స్ప‌రం రాజ‌కీయాన్ని ఆ రెండు పార్టీ నేత‌లు ర‌క్తిక‌ట్టించారు. ఇప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగుల బ‌దిలీల‌పై విడుద‌లైన జీవోపై రాజ‌కీయ వార్ న‌డుస్తోంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున బదిలీలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా కేడర్ పోస్టులకు పోస్టింగ్‌లు, బదిలీలపై జిల్లా కలెక్టర్ మరియు విభాగాధిపతి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సిబ్బంది నివాస స్థలాన్ని, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం లేదని క‌మ‌ల‌నాథుల వాద‌న‌. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీ చేస్తున్నారని బీజేపీ ఆందోళ‌న చేస్తోంది.ఇదే అంశంపై రాత్రి జాగ‌ర‌ణ చేసిన బండిని అరెస్టు చేయ‌డాన్ని నిర‌సిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు న‌డ్డా తెలంగాణ‌కు వ‌చ్చాడు. ఆయ‌న్ను కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప‌రిమితమైన కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ర్యాలీ నిర్వ‌హించి వెనుతిరిగారు. ఆ సంద‌ర్భంగా సిఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని విమ‌ర్శంచాడు.ఈ “ధర్మ యుద్ధం ఆగ‌ద‌ని కేసీఆర్ ను హెచ్చ‌రించాడు.

Also Read :  హూ కిల్డ్ టాలీవుడ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్భ యంతో జీవిస్తున్నారని, బండిని అరెస్టు చేయడాన్ని చౌహాన్ త‌ప్పుబ‌ట్టాడు. తెలంగాణలో నిజాం పాలన నడుస్తోందని రమణ్ సింగ్ ధ్వ‌జ‌మెత్తాడు. ఆదివారం రాత్రి వరంగల్‌లో అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఒవైసీ, ఔరంగజేబు, బాబర్, నిజాంలకు చోటు లేని నవ భారతాన్ని నిర్మిస్తామని హెచ్చ‌రించాడు. రాబోవు రోజుల్లో నిజాం చరిత్రను, ఒవైసీ చరిత్రను ఎవరూ చదవరు, మరిచిపోతారన్నార‌ని ధ్వ‌జ‌మెత్తాడు. కాకతీయ యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను తీసుకొస్తామ‌ని చెప్పాడు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన విధానంనుగుర్తు చేశాడు.జనవరి 14న సంక్రాంతి తర్వాత బీజేపీ నేతల రెండో విడత బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మేర‌కు సీనియర్‌ బీజేపీ నేత ఎన్‌ రాంచందర్‌రావు వెల్ల‌డించాడు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయ‌డానికి కేంద్ర నేతలు మరింత తెలంగాణ‌కు రానున్నారు. ఆ విష‌యాన్ని బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ చెబుతున్నాడు.
ప్ర‌స్తుతం ఫైర్‌బ్రాండ్ పీసీసీ నేత రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ సీనియ‌ర్ల మద్దతు లేకపోవడంతో రాజ‌కీయ గ్యాప్ తెలంగాణ‌లో క‌నిపిస్తోంది. ఆ గ్యాప్ ను పూడ్చేలా BJP పుంజుకుంది. దుబ్బాక , గ్రేటర్ హైదరాబాద్, హుజూరాబాద్ ఉప ఫ‌లితాలు బీజేపీకి ఊపునిచ్చాయి. డిసెంబర్ 27న ఎర్రబెల్లి గ్రామంలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గృహనిర్భందం చేశారు. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్త సి నవీన్ అలియాస్ తీర్మార్ మ‌ల్ల‌న్న‌పై పరువు నష్టంతో అరెస్టయ్యాడు.”అసమ్మతి తెలిపే వారిపై సిఎం కేసీఆర్ విరుచుకుపడుతున్నాడు. దీన్నే అవ‌కాశంగా తీసుకుని బీజేపీ పోరాటానికి మ‌రింత ప‌దును పెడుతోంది.