Site icon HashtagU Telugu

JP Nadda:తెలంగాణ గడ్డపై జేపీ నడ్డా హాట్ కామెంట్స్

Nadda

Nadda

కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు మతి భ్రమించిందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బుర్ర పనిచేయటం‌లేదని నడ్డా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని నడ్డా విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని, తన కుటుంబ కోసం కేసీఆర్ రాచరిక పాలన‌ కొనసాగిస్తున్నారని తెలిపిన నడ్డా తెలంగాణ ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందని, 317జీవోను ప్రభుత్వం సవరించేవరకు పోరాడుతామని
హామీ ఇచ్చారు.

బండి సంజయ్ అరెస్టు అప్రజస్వామికమని, బండి సంజయ్ పోరాటానికి జాతీయ పార్టీగా అండగా ఉందని నడ్డా తెలిపారు.

తెలంగాణ మంత్రుల ర్యాలీలు, సభలకు ఎలా అనుమతి ఇస్తున్నారని, ఎయిర్పోర్ట్ లో తనని ఆపటానికి ప్రత్నించిన పోలీస్ అధికారి కార్తికేయని అడగ్గా ఆయన దగ్గర తన ప్రశ్నకు జవాబు లేదని నడ్డా తెలిపారు.

ఉద్యోగులు, ప్రజలు కోసం బీజేపీ చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలపటానికి వచ్చానని, కాంగ్రెస్ మంచి పని చేయదని, చేసేవారిని చేయనివ్వదని నడ్డా విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు మతి భ్రమించిందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బుర్ర పనిచేయటం‌లేదని నడ్డా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని నడ్డా విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని, తన కుటుంబ కోసం కేసీఆర్ రాచరిక పాలన‌ కొనసాగిస్తున్నారని తెలిపిన నడ్డా తెలంగాణ ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందని, 317జీవోను ప్రభుత్వం సవరించేవరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.