MP Laxman : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోము – బీజేపీ ఎంపీ లక్ష్మణ్

దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తేరుచామని సీఎం రేవంత్ అంటున్నారని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పోకుండా చూసుకోవాలని సూచించారు

Published By: HashtagU Telugu Desk
Laxman

Laxman

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడలేమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman). జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) విజయసంకల్ప సభ (BJP Vijaya Sankalpa Yatra)లో ఆయన మాట్లాడుతూ… వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, రేవంత్ కేసీఆర్‌ను మరిపిస్తున్నారని ఎద్దెవా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తేరుచామని సీఎం రేవంత్ అంటున్నారని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పోకుండా చూసుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని విమర్శించారు. మాటలు చెప్పడంలో కేసీఆర్ ను రేవంత్ మించి పోయాడన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

Read Also : Rohit Sharma: నేడు ముంబై క్యాంపులోకి రోహిత్ శర్మ..!

  Last Updated: 18 Mar 2024, 02:30 PM IST