Site icon HashtagU Telugu

Telangana : కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం – బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman reacted to the phone tapping incident

BJP MP Laxman reacted to the phone tapping incident

తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) కు సంబంధించి రోజు రోజుకు అనేక కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేసి వారి దగ్గరి నుండి వాగ్మూలం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారంతా కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో ఈ కేసు ఫై బిజెపి ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని… దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి రాజీపడ్డారని ఆరోపించారు. తానూ ట్యాపింగ్ బాధితుడే అయినప్పటికీ సీఎం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ విషయం అని.. ఈ విషయంలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హైకమండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా? అని అనుమానాలు వ్యక్తం చేసారు.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో తాము సత్తా చాటబోతున్నామని.. డబుల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలుగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also : Tragic Incident : బాపట్లలో సరదా ఈత..ప్రాణాలు పోయేలా చేసింది