Site icon HashtagU Telugu

Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

Dhanyavaad Modi JI Padayatra

Dhanyavaad Modi JI Padayatra

Dhanyavaad Modi JI Padayatra: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘ధన్యవాద్ మోడీ జీ’ పాద‌యాత్ర (Dhanyavaad Modi JI Padayatra) నిర్వహించారు. ఈ యాత్రకు బీజేపీ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నాయకత్వం వహించారు. ఈ పాద‌యాత్రలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మోడీ కానుక: డాక్టర్ కే. లక్ష్మణ్

ఈ సందర్భంగా డాక్టర్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ.. జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపు నిర్ణయం సాధారణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన దసరా, దీపావళి కానుక అని అభివర్ణించారు. ఈ నిర్ణయంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రాణరక్షక మందులు, జీవిత బీమా వంటి వాటిపై పన్నులు లేకపోవడం ప్రజలకు పెద్ద ఊరట అని ఆయన తెలిపారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడంతో పాటు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: They Call Him OG Trailer: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల.. బాంబే వ‌స్తున్నా.. త‌ల‌లు జాగ్ర‌త్త‌!

వ్యాపారులకు విజ్ఞప్తి

పాద‌యాత్ర‌లో డాక్టర్ లక్ష్మణ్ అన్ని దుకాణదారులు, వ్యాపారులకు ఒక విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ సంస్కరణలను సక్రమంగా అమలు చేయడంలో సహకరించాలని కోరారు. తక్కువ జీఎస్టీ రేట్లు ఉన్న వస్తువుల ధరలను తగ్గించి, ప్రజలకు దాని ప్రయోజనం అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల వినియోగదారులకు, వ్యాపారులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ పాద‌యాత్ర‌లో బీజేపీ కార్యకర్తలు మోడీకి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేందుకు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీలో మార్పులు ఒక కీలక అడుగు అని డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Exit mobile version