Site icon HashtagU Telugu

Lok Sabha Elections : హైద‌రాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త ఆస్తులు ఎంతో తెలుసా..?

Madavilatha

Madavilatha

ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల తాలూకా ఆస్తుల వివరాలు (Details of Assets) ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి. కోటికి పైనే తప్ప ఏ ఒక్కరికి కోటి కంటే తక్కువ ఆస్తులు కనిపించడం లేదు. ఒకర్ని మించి ఒకరి ఆస్తులు ఉండడంతో ప్రజలు నోర్లు వెళ్లబెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వందల సంఖ్యలో నామినేష్లలు దాఖలు చేయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో హైద‌రాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థిగా బరిలోకి దిగిన మాధ‌వీల‌త (Madavilatha) .. ఎన్నిక‌ల నామినేష‌న్ అఫిడ‌విట్ ప్ర‌కారం ఆమె ఆస్తుల విలువ రూ. 218.38 కోట్లుగా పేర్కొంది. ఇక రూ. 27 కోట్లు అప్పులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి చెందిన విరించి హాస్పిట‌ల్ విలువ రూ. 94.44 కోట్లు కాగా, ఇందులో మాధ‌వీల‌త షేర్లు రూ. 2.94 కోట్లు. చ‌రాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లు అని పేర్కొన్నారు.

అలాగే ఇదే హైదరాబాద్ నుండి ఎంఐఎం నుండి బరిలోకి దిగిన ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆస్తుల విలువ రూ. 23.87 కోట్లుగా పేర్కొన్నారు. రూ. 7 కోట్ల అప్పులు ఉన్న‌ట్లు ఆయ‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. లండ‌న్‌లో ఎల్ఎల్‌బీ డిగ్రీ చేసిన‌ట్లు తెలిపారు. తనపై ఐదు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక త‌న వ‌ద్ద ఒక రైఫిల్, పిస్తోల్ ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

Read Also : PM Modi Vs Rahul Gandhi : ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు