Site icon HashtagU Telugu

Brij Bhushan Misbehav: మహిళ జర్నలిస్టుపై బ్రిజ్ భూషణ్ దురుసు ప్రవర్తన.. ఫైర్ అయిన షర్మిల

Brij Bhushan

New Web Story Copy 2023 07 12t151628.544

Brij Bhushan Misbehav: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తాజాగా ఓ మహిళ జర్నలిస్ట్ తో దురుసుగా ప్రవర్తించి విమర్శలు మూటగట్టుకున్నాడు. మహిళలు అంటే చిన్న చూపు చూసే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. అతనిని వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేసింది.

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు విషయమై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ను ప్రశ్నించింది ప్రముఖ మీడియా మహిళ జర్నలిస్ట్. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు మీ పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తారని సదరు మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించింది. దీనికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆ జర్నలిస్ట్ తో దురుసుగా ప్రవర్తించాడు. ఓ మహిళ అని కూడా చూడకుండా అవమానకరంగా ప్రవర్తించాడు. అయినప్పటికీ ఆ మహిళా జర్నలిస్ట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ను ప్రశ్నిస్తూనే ఉంది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ కారులో కూర్చుని ఉండగా మహిళా తన చేతిలో ఉన్న మైక్ ని కారు లోపలి పెట్టగా… ఆ సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ కారు డోర్ వేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ మహిళా చేయి కారు డోర్ మధ్యలో నలిగిపోయింది. మైక్ కిందపడింది. దీంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ పై మహిళలు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి జర్నలిస్టుతో ఇలానేనా ప్రవర్తించేది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా జర్నలిస్టుతో ప్రవర్తించిన తీరుపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళ జర్నలిస్టుపై అవమానకరంగా ప్రవర్తించడంపై కలత చెందినట్టు ఆమె చెప్పారు.బ్రిజ్ భూషణ్ 6 మంది మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో భారతదేశం అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, అతనిపై ఇంకా ఎందుకు చర్య తీసుకోలేదో దేశం తెలుసుకోవాలని ఆమె అన్నారు. వెంటనే అతనిని పార్లమెంటరీ సభ్యత్వం నుండి తొలగించి, చట్టపరంగా ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.

Read More: Kim Jong Un: ఉత్తర కొరియాలో ఆహార కొరత.. కానీ కిమ్‌ తాగే వైన్‌ ధరెంతో తెలుసా..?