Site icon HashtagU Telugu

BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకాన్ని స్వాగ‌తిస్తున్నా – ఎంపీ అర‌వింద్‌

Aravind2

Aravind2

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఎంపీ అర‌వింద్ తెలిపారు. కిష‌న్‌ రెడ్డి నాయకత్వం పార్టీ రాష్ట్ర శాఖకు అదృష్టమని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి పరిణతి చెందిన రాజకీయవేత్త అని, ఆయ‌న్ని రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియమించినందుకు పార్టీ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను నియమించినందుకు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవీకాలాన్ని దూకుడుగా పూర్తి చేశారని, తెలంగాణలో పార్టీ విజయానికి అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.