Site icon HashtagU Telugu

BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

BJP MLA Raja Singh

BJP MLA Raja Singh

BJP MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

బక్రీద్ నేపథ్యంలో మెదక్ లో పశువుల రవాణా మరియు అమ్మకం సమస్యపై మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న రాజాసింగ్ మెదక్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా పోలీసులు ఆయనను ఆదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు.

జూన్ 15 శనివారం నాడు ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది మరియు మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తా సమీపంలో 144 సెక్షన్ విధించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 144, ఒక ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేదించారు. కాగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మెదక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం బి బాల స్వామి తెలిపారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తున్నందున దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఆవుల రవాణాను భారతీయ జనతా యువమోర్చా నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగిందని, ఫిర్యాదు చేయకుండా నిరసనకు దిగారని ఆయన తెలిపారు. కొట్లాటలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిపై కూడా దాడి జరిగింది.

Also Read: Prabhas : మోహన్ బాబు, ప్రభాస్ గురించి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆడవాళ్ళ మాదిరి..

Exit mobile version