Etela : మీరేమన్న సుద్దపూసలనుకుంటున్నారా? మేకవన్నె పులులు..వారి కంట్లో కారం కొట్టారు..!!

తెలంగాణలో మునుగోడు రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. అధికారపార్టీతోపాటు ప్రతిపక్షాలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 05:46 AM IST

తెలంగాణలో మునుగోడు రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. అధికారపార్టీతోపాటు ప్రతిపక్షాలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చుండూరులో చేనేత సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఫైర్ అయ్యారు. చేనేత కార్మికుల కంట్లో కారం కొట్టారని తీవ్ర విమర్శలు చేశారు. చేనేత సమస్యలపై పోరాటం చేసింది ఈటెల అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

బతుకమ్మ చీరలను చేనేత కార్మికులతో తయారు చేయిస్తానన్నసీఎం కేసీఆర్…వారి కంట్లో కారం కొట్టి మరమగ్గాల ద్వారా తయారు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సిరిసిల్లలో తప్ప ఎక్కడా పవర్ లూమ్స్ లో కనీస సౌకర్యాలు లేవన్నారు. నియోజకవర్గ డెవలప్ మెంటో కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోఎన్నో అభివ్రుద్థి పథకాలు వస్తున్నాయని వివరించారు. ఈ నియోజకవర్గంపై సీఎం, ఆయన అనుచరులు, 80మంది ఎమ్మెల్యేలు గొర్ల మందపై తోడేళ్లు పడ్డట్లు పడ్డారని మండిపడ్డారు.

మునుగోడుకు వచ్చి సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని…మీరు సుద్ధపూసలు కాదు మేకవన్నే పులులు అంటూ ఘాటువ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డ ఆత్మగౌరవం కలిగి గడ్డ అన్న ఈటెల…ఈ గడ్డపై ధర్మమే గెలుస్తుందన్నారు.