BJP Membership Drive Start Today in Telangana : ముచ్చటగా మూడోసారి అధికారంలోకి బిజెపి (BJP)..తెలంగాణ (Telangana) ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. గతంలో కంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా పట్టు పెరగడం తో అన్ని నియోజకవర్గాల ఫై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 50 లక్షల మెంబర్షిప్ (50 Lak) టార్గెట్ పెట్టుకుంది. ఈ నెల మూడు నుండి సభ్యత్వ నమోదు (Membership Drive) కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ..రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడం తో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈరోజు ఆ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సోమాజీగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంఛార్జీలు, జాతీయ నాయకులు అర్వింద్ మీనన్, అభయ్ పాటిల్ హాజరుకానున్నారు.
సభ్యత్వ నమోదు అంశంపై నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు
ప్రతి పోలింగ్ బూత్‌లో 200 మంది సభ్యత్వాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే చేపట్టనుంది. ఈనెల 25న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతోందని, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు స్వీకరించాలని రాష్ట్ర సంస్థాగత ఇంచార్జీ, జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో సభ్యత్వ నమోదు లక్ష్యాలను వివరించి, పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని మార్గనిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also : Burger House Viral : బర్గర్ ఇల్లు..భలేగా ఉందే..!!