Site icon HashtagU Telugu

BJP Vs TRS : దండ‌యాత్ర‌కు డేట్‌, ప్లేస్ ఫిక్స్

BJP CM

Amit Shah Bandi Sanjay

పాత‌బ‌స్తీ భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి దేవాల‌యం నుంచి దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బీజేపీ శాసించింది. అదే పంథాను ఈసారి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి బీజేపీ అనుస‌రించ‌నుంది. అధికారంలోని టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేలా ఈసారి బీజేపీ దండ‌యాత్ర ఉండేలా ఢిల్లీ పెద్ద‌లు స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. వ‌చ్చే నెలా 14వ తేదీ త‌రువాత బీజేపీ విశ్వ‌రూపం ఏమిటో చూపాల‌ని ప్ర‌ణాళిక‌ను ర‌చించిన‌ట్టు స‌మాచారం. ఆ రోజున తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండో విడ‌త పాద‌యాత్ర‌కు గ‌ద్వాల నుంచి శ్రీకారం చుట్ట‌బోతున్నాడు. అక్క‌డ నుంచి పెనుమార్పులు ఉంటాయ‌ని టాక్‌.అధికారాన్ని అందుకోవ‌డానికి ద‌గ్గ‌ర‌గా ఉండే రాష్ట్రాల్లో బీజేపీ ప్లానింగ్ ప‌గ‌డ్బందీగా ఉంటుంది. ఆ జాబితాలో తెలంగాణ ఉంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. అందుకే,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక దృష్టిని పెట్టాడు. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా వ‌చ్చి వెళ్లిన షా ఈసారి కొత్త పంథాను అమ‌లు చేయ‌డానికి సిద్ధం అయ్యాడ‌ని తెలుస్తోంది. ఏప్రిల్ 10న తెలంగాణ‌కు రానున్న అమిత్ షా శ్రీరామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని భ‌ద్రాచ‌లం వెళ్ల‌నున్నాడు. సీతారాముల క‌ల్యాణం వేడుక కోసం ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తాడు. అదే రోజున ఆయ‌న పాత‌బ‌స్తీలోని భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి ఆల‌యాన్ని కూడా వెళ్ల‌నున్నాడు. అంతేకాదు, దేవాల‌యాల ద‌ర్శ‌నం త‌రువాత మేధావుల‌తో షా స‌మావేశం కానున్నాడు.

గ‌తంలో దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారు దేవాల‌యానికి వెళ్లాడు. ఆ సంద‌ర్భంగా ఉద్రిక్త‌త నెల‌కొంది. ముస్లింలు ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో భాగ్య‌లక్ష్మీ దేవాల‌యం ఉంది. అక్క‌డ‌కు హిందూ నేత‌లు వెళ్ల‌డానికి భారీ బందోబ‌స్తు అవ‌స‌రం. ప్ర‌త్యేకించి అమిత్ షా లాంటి వాళ్లు సంద‌ర్శ‌నంకు వ‌స్తున్నారంటే పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రిస్తారు. ఆ హ‌డావుడి హిందూ, ముస్లింల మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని మ‌రింత పెంచుతోంది. దుబ్బాక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అదే జ‌రిగింది. ఈసారి కూడా ఏప్రిల్ 10వ తేదీన అమిత్ షా టూర్ రాజ‌కీయ హీట్ ను పెంచ‌నుంది.ఆ హీట్ ను మ‌రింత పెంచేలా నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే తిరిగి ఏప్రిల్ 14న షా తెలంగాణ‌కు రానున్నాడు. ఆ రోజున బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు హాజ‌రు అవుతాడు. ఆ లోపుగా ఇత‌ర పార్టీల‌ నుంచి వ‌చ్చే లీడ‌ర్ల జాబితా సిద్ధం చేయ‌డానికి బీజేపీ తెలంగాణ విభాగం స్కెచ్ వేసింది. ఇప్ప‌టికే 45 మంది ఎమ్మెల్యేలు, ఆరు మంది ఎంపీలు ట‌చ్ లో ఉన్నార‌ని గ‌త ఏడాది నుంచి బీజేపీ చెబుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని ప‌దేప‌దే బండి సంజ‌య్ అనేక వేదిక‌ల‌పై చెప్పాడు. అంతేకాదు, కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ ఊద‌ర‌గొట్టాడు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రెండూ జ‌ర‌గ‌లేదు. మ‌ళ్లీ అవే నినాదాల‌ను బీజేపీ అధ్య‌క్షుడు చెప్ప‌డానికి వెనుకాడ‌డంలేదు. ఈసారి ఖ‌చ్చితంగా కేసీఆర్ కు భారీ షాక్ త‌గులుతుంద‌ని చెబుతున్నాడు.

తాజాగా కేసీఆర్ చేయించిన స‌ర్వేలో ఎమ్మెల్యేల ప‌నితీరు నాశిర‌కంగా ఉంద‌ని తెలుస్తోంది. సుమారు 70 మంది ఎమ్మెల్యేల‌ను కొత్త‌గా ఎంపిక చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు, చాలా మంది పార్టీలో అంత‌ర్గ‌తంగా అసంతృప్తిగా ఉన్నార‌ని వినికిడి. వీట‌న్నింటినీ గ‌మ‌నిస్తోన్న బీజేపీ ప్ర‌జాద‌ర‌ణ ఉన్న టీఆర్ఎస్ లీడ‌ర్ల‌పై వ‌ల వేస్తోంది. ప‌క్కాగా ఆప‌రేష‌న్ చేస్తోంది. ఆ క్ర‌మంలో ఎంత మంది కారు పార్టీకి గుడ్ బై చెబుతారో..త్వ‌ర‌లోనే తేల‌నుంది. నేరుగా అమిత్ షా రంగంలోకి దిగ‌డంతో ఈసారి ఆప‌రేష‌న్ చాలా సీరియ‌స్ గా ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ల‌పై బీజేపీ ఎక్కువ‌గా ఆప‌రేష‌న్ చేయాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే గ్రూప్ ల‌తో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్ ను మ‌రింత సంక్షోభంలోకి నెట్టేలా క‌మ‌ల‌నాథులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కీల‌క‌మైన లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఫ‌లితంగా బీజేపీ రాజ్యాధికరం. దిశ‌గా వెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తం మీద అమిత్ షా వ‌చ్చే నెల తెలంగాణ టూర్ ప్ర‌త్య‌ర్థుల గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.