Site icon HashtagU Telugu

Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం

Lok Sabha Results 2024

Lok Sabha Results 2024

Lok Sabha Results 2024: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. గెలిచిన ఆనందంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టు పని చేస్తానని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం కొట్లాడతామని, అలాగే మోదీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు తెస్తామని చెప్పారు.

తెలంగాణలో బిజెపి 8 స్థానాలను గెలుచుకుంది.

1) మహబూబ్ నగర్: డికే అరుణ.
2) మెదక్ : రఘునందన్ రావు
3) అదిలాబాద్ : జి నాగేష్
4) మల్కాజ్ గిరి : ఈటెల రాజేందర్
5) సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి
6) కరీంనగర్ : బండి సంజయ్
7) నిజామాబాద్ : ధర్మపురి అరవింద్
8) చేవెళ్ల :కొండ విశ్వేశ్వర్ రెడ్డి

Also Read: Allu Arjun : పవన్ విజయం పై అల్లు అర్జున్ ట్వీట్.. ఏమన్నాడో తెలుసా..?