Site icon HashtagU Telugu

Bandi Sanjay: టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందే: బండి సంజయ్ వార్నింగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ముందు బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బండి సంజయ్ టికెట్ల వ్యవహారం గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా కాకుండా, బిజెపి నాయకత్వం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు టిక్కెట్లు ఇస్తుందని తేల్చి చెప్పారు. నగర శివార్లలోని చంపాపేట్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో టికెట్లు నిర్ణయించేది బీఆర్‌ఎస్ అని, అయితే ప్రజలతో సన్నిహితంగా పనిచేసే బీజేపీ నేతలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని అన్నారు.

“మేము మా సర్వే నివేదికల ఆధారంగా మాత్రమే టిక్కెట్లు ఇస్తాము. ‘షో’ చేసేవాళ్లకు టికెట్లు ఇవ్వం. మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ప్రతి ఒక్కరూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాలన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై పార్టీ నాయకత్వం కఠినంగా వ్యవహరిస్తుంది’ అని అన్నారు.  పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సాల్‌ కూడా ఎన్నికలలోపు గ్రూపు విభేదాలను సత్వరమే పరిష్కరించుకోవాలని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఐక్యంగా కృషి చేయాలని నేతలంతా కోరారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాలేదని సంజయ్ అన్నారు. “కర్ణాటకలో AIMIM, JD (S) నాయకులు కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశాయని, తెలంగాణలో బీజేపీని జోరును నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి కుట్ర జరుగుతోంది. క్రమశిక్షణా రాహిత్యం వల్ల పార్టీ నష్టపోకూడదు. ప్రతి నాయకుడు ప్రజలతో మమేకం కావాలి, వారి సమస్యలపై శ్రద్ధ వహించాలి, ” అని తరుణ్ చుగ్ కూడా పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే!

Exit mobile version