గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలోని పురానాపూల్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ దిష్టి బొమ్మ (CM Revanth Reddy Dishti Bomma) దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే యువకులు స్థానికులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి ఫోన్లలోనూ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫొటోలు ఉన్నాయని, వాటితో పాటు గన్, బుల్లెట్ల ఫొటోలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.
రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని చెపుతున్న..కొంతమంది అనుమానాస్పదంగా ఇంటి వద్ద తిరుగుతున్నారని చెపుతున్నప్పటికీ..పోలీసులు అప్రమత్తం కాకపోవడం..బీజేపీ నాయకులకు ప్రాణహాని ఉన్న ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదంటూ ఈరోజు పురానాపూల్ చౌరస్తా వద్ద బిజెపి పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ప్రభుత్వం రాజా సింగ్‌కి భద్రతను పెంచాలని, కుట్రలు చేస్తున్న వారి వెనుక ఎవరూ ఉన్న వెంటనే విచారించి.. చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో బీజేపీ కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటె కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి .. ఇందిరాపార్కు ధర్నాచౌక్ (Dharnachowk to Indira Park) వద్ద ఈరోజు బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ (Rythu Hamila Sadhana Deeksha) చేపట్టింది. 24 గంటల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Read Also : X Value Down : ‘ఎక్స్’ విలువ రూ.3.68 లక్షల కోట్ల నుంచి రూ.78వేల కోట్లకు డౌన్