Site icon HashtagU Telugu

Vijayashanthi : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు పిచ్చికి పరాకాష్ట తప్ప మరోకటి కాదు…!!

Vijaya Santhi

Vijaya Santhi

బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. RSSచీఫ్ మోహన్ భగవత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. మోహన్ భగవత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని..ముస్లింలను వేరు చేసే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మోహన్ భగవత్ ఎవరిని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికుంటే కౌన్సిలర్ గా గెలిచి చూపమంటారు నేటి బీఆర్ఎస్ నేతలు. లోక కల్యాణమే ఏకైక లక్ష్యంగా ఉన్న హిందూ ధర్మాన్ని పరిరక్షించే RSSసంస్థ చీఫ్ మోహన్ భగవత్ ను ఉద్దేశించి బందిపోట్ల రజాకార్ సమితి నేత మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అకాశంపై ఉమ్మివేసేందుకు ప్రత్నించినట్లు ఉన్నాయన్నారు. మహోన్నత సిద్ధాంతకర్తలకు , ఎన్నికలకు రాజకీయాలకు పోలిక పెట్టడం వీళ్ల అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. పరనింద తప్ప మరొకటి చేతగాని ఈ నేతలకు విమర్శలను ఎదుర్కొనే సత్తా లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు తన వైఫల్యాలను ఎత్తి చూపినప్పుడల్లా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటారని మండిపడ్డారు.