Rachana Reddy On KTR: హిందీ ఇష్యూ.. కేటీఆర్ పై రచనా రెడ్డి ఫైర్!

దేశ ప్రజలపై బలవంతంగా హిందీభాషను రుద్దాలని అనుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పురపాలకశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌

  • Written By:
  • Updated On - October 13, 2022 / 01:16 PM IST

దేశ ప్రజలపై బలవంతంగా హిందీభాషను రుద్దాలని అనుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పురపాలకశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు తప్పుపట్టారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ నాయకురాలు రచనా రెడ్డి మాట్లాడుతూ హిందీ భాషా ప్రయోగానికి సంబంధించిన సమస్యను “డైవర్ట్ అండ్ డైల్యూట్” చేస్తున్నారని, ఈ విషయంలో కేంద్రం చాలాసార్లు వివరణ ఇచ్చిందని అన్నారు.

“భారతదేశానికి జాతీయ భాష లేదు. అనేక అధికారిక భాషలలో హిందీ ఒకటి. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై రచనారెడ్డి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పదే పదే స్పష్టం చేసిన అంశాన్ని కేటీఆర్ పూర్తిగా డైవర్ట్ చేసి డైల్యూట్ చేయడం తీరు తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం మాతృభాష, హిందీతో సహా ఇతర మాతృభాషలకు ప్రాధాన్యత ఇవ్వాలి ”అని ఆమె అన్నారు. “ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో”  కేటీఆర్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని రచనారెడ్డి మండిపడ్డారు.