Lakshman: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS)పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజులో బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. .ప్రజలు మోడీ(Modi)ని గెలిపించాలన పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదని తెలిపారు. రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన..ఉచితాల్ని , గ్యారంటీ లను ప్రజలు నమ్మలేదు. అమలు గానీ హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెను సంక్షోభం లోకి నెట్టబోతుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ చచ్చిన పాము కారు గారేజ్ నుండి వచ్చే అవకాశం లేదన్నారు. కారు ను స్క్రాప్ లో కూడా అమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ లో బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీ గా ఎదగబోతుందని తేల్చి చెప్పారు. అధికార దాహం కోసం గతం లో కెసిఆర్ కాంగ్రెస్ లో చేరలేదు..అవినీతి పరులు ఏకం అయ్యి ఇండి కూటమి కట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు.