Site icon HashtagU Telugu

Telangana BJP: డీకే అరుణ పార్టీ మార్పులో నిజమెంత?

Dk Aruna

Dk Aruna

Telangana BJP: తెలంగాణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా ఆమె పార్టీ మారబోతున్నారనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ డీకే అరుణ పార్టీ మారబోతుందనే ప్రచారం సాగుతుంది. డీకే అరుణ బీజేపీ వీడి మళ్ళీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆమె పార్టీ మార్పుపై ఘాటుగా స్పందించారు. బీజేపీ నాకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా పదవి ఇచ్చి నన్ను గౌరవించింది. నాకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు డీకే అరుణ. తనపై వస్తున్న నెగటివ్ ప్రచారంపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె మండి పడ్డారు. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.

https://twitter.com/aruna_dk?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor

 

ఇదిలా ఉండగా తెలంగాణాలో రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశగా వ్యూహాలు రచిస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. త్వరలోనే తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో వచ్చేది కమలం పార్టీనేనని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

Read More: Housewarming: గోమాతతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు.. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

Exit mobile version