BJP Leader: సెల్ఫీ వీడియో తీసుకోని బీజేపీ నేత ఆత్మహత్య.. కారణమిదే..?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో బీజేపీ నేత (BJP Leader) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నమ్మినవారు ముంచేశారంటూ ఆరోపిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి పార్టీ నేతలందరికీ షేర్ చేసిమరీ ప్రాణాలు తీసుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Sucide Imresizer

Sucide Imresizer

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో బీజేపీ నేత (BJP Leader) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నమ్మినవారు ముంచేశారంటూ ఆరోపిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి పార్టీ నేతలందరికీ షేర్ చేసిమరీ ప్రాణాలు తీసుకున్నాడు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా ఎనుమాముల బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే, ఎన్నికల సమయంలో మాజీ సర్పంచ్ సాంబేశ్వర్‌ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నానని, డబ్బుల కోసం అతడు వేధించాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు.

Also Read: Two BRO Labourers Killed: హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం.. ఇద్దరు కార్మికులు మృతి

నమ్మినవారు తనను మోసం చేశారని విలపించాడు. ఆ వీడియోను మిత్రులకు, తోటి వ్యాపారులకు పంపించి ఇంట్లో ఉరేసుకున్నాడు. వరంగల్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఆయన బిఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగాలని భావించారు. బిఆర్ఎస్ నేతలు టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి బీజేపీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం ఎనుమాముల మాజీ సర్పంచ్ సాంబేశ్వర్ నుంచి రూ.25 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పు చెల్లించలేక, సాంబేశ్వర్ చేస్తున్న ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

  Last Updated: 06 Feb 2023, 10:05 AM IST