Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే

మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ సారి ఎంపీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Overseas Friends Of BJP

Telangana BJP

Telangana BJP: మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ సారి ఎంపీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకొనే ప్రయత్నాల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించాలని భావిస్తుంది. గత ఎన్నికల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది స్థానాల్లో కారు పార్టీ దక్కించుకుంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సారి బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచి సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది.

నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు:

ఆదిలాబాద్ – పాయల్ శంకర్ (ఎమ్మెల్యే)
పెద్దపల్లి – రామారావ్ పవార్ (ఎమ్మెల్యే)
కరీంనగర్ – సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
నిజామాబాద్ – మహేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – కె.వెంకటరమణా రెడ్డి (ఎమ్మెల్యే)
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
సికింద్రాబాద్ – డాక్టర్ లక్ష్మణ్ (ఎంపీ)
హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
చేవెళ్ల – ఏ వెంకటనారాయణ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – రామ్ చందర్ రావు (మాజీ ఎమ్మెల్సీ)
నాగర్ కర్నూల్ – రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
నల్గొండ – చింతల రామచంద్రా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

Also Read: Kesineni Sweatha : విజ‌య‌వాడ మేయ‌ర్‌కి రాజీనామా లేఖ ఇచ్చిన కేశినేని శ్వేత‌.. లోకేష్ వ‌ల్లే తాము..?

  Last Updated: 08 Jan 2024, 02:19 PM IST