Donkey Egg: తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. సీఎం రేవంత్ ట్వీట్, మ‌రోసారి గాడిద గుడ్డు హైలైట్‌..!

బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు.

  • Written By:
  • Updated On - May 1, 2024 / 11:43 AM IST

Donkey Egg: బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటీవ‌ల గాడిద గుడ్డు (Donkey Egg) అనే ప‌దం వాడి బీజేపీని దుయ్య‌బ‌డుతున్నారు. బీజేపీ తెలంగాణ‌కు ఏం ఇచ్చిందో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయ‌కుల‌కు సైతం ప్ర‌శ్న‌లు వేస్తూ ప‌దేళ్ల‌లో తెలంగాణకు ఏం సాధించి పెట్టార‌ని మండిప‌డ్డారు.

మేడే సంద‌ర్భంగా తాజాగా ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ అడిగింది పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా.. బీజేపీ ఇచ్చింది “గాడిద గుడ్డు”. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు”. అని ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం సీఎం రేవంత్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Also Read: CM Revanth Wishes: కార్మికుల‌కు మేడే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌.. కేసీఆర్ కూడా..!

సీఎం రేవంత్ ట్వీట్‌లో ఏం రాశారంటే.. తెలంగాణ అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. బీజేపీ ఇచ్చింది “గాడిద గుడ్డు”.
తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ. బీజేపీ ఇచ్చింది “గాడిద గుడ్డు”. తెలంగాణ అడిగింది కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం. బీజేపీ ఇచ్చింది “గాడిద గుడ్డు”. తెలంగాణ అడిగింది మేడారం జాతరకు జాతీయహోదా. బీజేపీ ఇచ్చింది “గాడిద గుడ్డు”. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు” అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే తాజాగా సరూర్‌నగర్‌లో జరిగిన ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బుల్లెట్ రైలు, గిఫ్ట్ సిటీ, సబర్మతి వంటి ప్రాజెక్టుల ద్వారా గుజరాత్‌కు బంగారు గుడ్డు తీసుకెళ్తుండగా, తెలంగాణకు ప్రధాని మోదీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పెట్టుబడి దారి మళ్లింపులు అని ఆరోపించారు. మోదీ తన ప్రసంగంలో ఎక్కువ భాగం తెలంగాణకు, దాని నివాసితులకు ఏమి అందిస్తారో చర్చించే బదులు తనపై దాడి చేయడంపై దృష్టి పెట్టారని అన్నారు.