Telangana : బిజెపికి భారీ షాక్..కాంగ్రెస్ లోకి ఆ ఐదుగురు..?

ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో BRS Vs BJP గా ఉండేది కానీ ఇప్పుడు BRS Vs Congress గా మారింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు , బండి సంజయ్ ని అధ్యక్షా పదవి నుండి తొలగించడం రాష్ట్రంలో బిజెపి ఫై నమ్మకాలు లేకుండాచేశాయి

Published By: HashtagU Telugu Desk
Bjp Five Important Leaders Joins Congress

Bjp Five Important Leaders Joins Congress

తెలంగాణ లో రోజుకు రోజుకు బిజెపి (BJP) హావ తగ్గుతుందా..? అంటే అవుననే చెప్పాలి. ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో BRS Vs BJP గా ఉండేది కానీ ఇప్పుడు BRS Vs Congress గా మారింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు , బండి సంజయ్ (bandi Sanjay) ని అధ్యక్షా పదవి నుండి తొలగించడం రాష్ట్రంలో బిజెపి ఫై నమ్మకాలు లేకుండాచేశాయి. బండి సంజయ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షా పదవి లో ఉన్నప్పుడు బిఆర్ఎస్ తగ్గ పోరు గా బిజెపి పార్టీ ని నడిపించాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా బండి సంజయ్ ని తప్పించడం..కిషన్ రెడ్డి (Kishan Reddy) కి బాధ్యతలు అప్పగించడం అందర్నీ షాక్ లో పడేసింది. బిఆర్ఎస్ – బిజెపి ఒక్కటే అని..బయటకు మాత్రమే కేంద్ర బిజెపి బిఆర్ఎస్ ఫై నిప్పులు చెరుగుతుందని..లోపల లోపల ఇద్దరు కుమ్మక్కయ్యారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది క్రమంలో కాంగ్రెస్ హావ పెరిగిపోతుండటంతో బిజెపి నేతలు సైతం అయోమయంలో పడ్డారు. బిజెపిని నమ్ముకుంటే ఏమి ఉండదని గ్రహిస్తూ..మెల్ల మెల్లగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చేందుకు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ను, బిఆర్ఎస్ ను వీడిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిజెపి లోని ఐదుగురు కీలక నేతలు , మాజీ ఎంపీ లు కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు సిద్దమయ్యినట్లు తెలుస్తుంది.

తెలంగాణ లో డిసెంబర్ 07 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ఎన్నికలకు పట్టుమని నాల్గు నెలల సమయం కూడా లేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసల జోరు ఎక్కువైంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు ఎక్కువుతున్నాయి. బిఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ ప్రధాన నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది..ఇంకా చేరేందుకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ సైతం చేరికల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు..ప్రతి ఒక్కర్ని పార్టీ లోకి హ్వానిస్తూ బలం పెంచుకుంటుంది. స్వయంగా నేతల ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు హస్తం పార్టీ ముఖ్య నేతలు. రీసెంట్ గా తుమ్మల నాగేశ్వరరావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికలే ఇందుకు నిదర్శనం.

తాజాగా బీజేపీ నుంచి హస్తం గూటికి చాలా మంది నేతలు రానున్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ఎంపీ విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరితో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై..తమ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ వీరంతా కాంగ్రెస్ గూటికి చేరితే..ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగుందని అంత భావిస్తున్నారు. అతి త్వరలో వీరు కాంగ్రెస్ లో చేరతారని గట్టిగా చెపుతున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..

Read Also : Anasuya Bharadwaj : చీరకట్టి గ్లామర్ తో మ్యాజిక్ చేస్తున్న అనసూయ భరద్వాజ్

  Last Updated: 27 Sep 2023, 12:14 PM IST