BJP Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అభిప్రాయపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీపావళి పండుగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు పాల్గొంటారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరులతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. ఎంఐఎం పార్టీతో బీజేపీ కలిసే అవకాశం లేదు . బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. మజ్లిస్ పార్టీతో పాటు లాభపడింది కాంగ్రెస్ పార్టీయే . బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కేవలం ఐదు నెలల్లోనే కర్ణాటకను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Huaorani Tribe : కోతులు తింటారు.. ఆకులు కట్టుకుంటారు.. వింత తెగ వివరాలివీ