BJP-Congress : `ఆప‌రేష‌న్ ఆకర్ష్`పై ఇద్దరూ సైంధ‌వులే..!

కాంగ్రెస్, బీజేపీల్లో(BJP-Congress) ఉత్కంఠ నెల‌కొంది. బీఆర్ఎస్ ల‌క్ష్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావులు ప‌యనం ఎటు?

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 05:17 PM IST

కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ విభాగాల్లో(BJP-Congress) ఉత్కంఠ నెల‌కొంది. బీఆర్ఎస్ ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావులు ప‌యనం ఎటు? అనేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి ముహూర్తం ఫిక్స్ అయింద‌ని తెలుస్తోంది. అయితే, చివ‌రి నిమిషంలో బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ట్విస్ట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్ లేక‌పోలేదు. గ‌త కొన్ని నెల‌లుగా కాంగ్రెస్, బీజేపీలోకి రావ‌డానికి పెద్ద‌గా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌డంలేదు. కార‌ణం ఆ పార్టీల్లోని అధ్య‌క్షుల తీరు అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏకప‌క్షంగా అటూ బండి(Sanjay) ఇటు రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్య‌వ‌హ‌రించ‌డం ప‌లు సంద‌ర్భాల్లో వివాద‌స్ప‌ద‌మైన విష‌యం విదిత‌మే.

కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ విభాగాల్లో  ఉత్కంఠ(BJP-Congress)

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీలోని కీల‌క లీడ‌ర్లుగా ఉన్న దాసోజు శ్రావ‌ణ్‌, కార్య‌క్ర‌మాల క‌మిటీ చైర్మ‌న్ మ‌హీంధ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌దిత‌రులు పార్టీని వీడారు. వాళ్లంద‌రూ(BJP-Congress) రేవంత్ రెడ్డి నాయ‌కత్వంపై అస‌హ‌నంతో వెళ్లిపోయారు. ఇత‌ర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేర‌డానికి వ‌చ్చే వాళ్లు కూడా రేవంత్ రెడ్డిని బూచిగా చూపిస్తూ ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ల జాబితాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూప‌ల్లి, ష‌ర్మిల కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న్ను పీసీసీ నుంచి త‌ప్పిస్తే క‌నీసం 20 మంది లీడ‌ర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని పొంగులేటి, జూప‌ల్లి కాంగ్రెస్ అధిష్టానంకు సూచించార‌ని తెలుస్తోంది. కొన్ని కండీష‌న్లు, అనుచ‌రుల‌కు ప‌ద‌వులు ఇచ్చేందుకు ఢిల్లీ అధిష్టానంతో పొంగులేటి, జూప‌ల్లి మంత‌నాలు సాగించిన‌ట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ప్ర‌మేయం లేకుండా ఉంటేనే పార్టీలో చేర‌తామ‌న్న కండీష‌న్లు ఉంచ‌డం గ‌మ‌నార్హం.

రేవంత్ రెడ్డి నాయ‌కత్వంపై అస‌హ‌నంతో

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ నాయ‌క‌త్వం కూడా ఇంచుమించు రేవంత్ రెడ్డి త‌ర‌హాలో (BJP-Congress)వ్య‌తిరేక‌త‌ను చ‌విచూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న గ్రాఫ్ నాయ‌క‌త్వం విష‌యంలో పెర‌గ‌లేదు. పైగా ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లు అస‌హ‌నంగా ఉన్నారు. నాయ‌క‌త్వాన్ని మార్చాల‌న్న డిమాండ్ బీజేపీ అధిష్టానం వ‌ద్ద ఉంచుతున్నారు. క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా ఒక గ్రూప్ బండికి వ్య‌తిరేకంగా ఢిల్లీ వెళ్లింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన డీకే అరుణ, మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి, విజ‌య‌శాంతి త‌దిత‌రులు ఇమ‌డ‌లేక‌పోతున్నారు. కార‌ణం బండి సంజ‌య్ నాయ‌క‌త్వ లోపం. ఆయ‌న్ను అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తే పొంగులేటి, జూప‌ల్లితో పాటు క‌నీసం బీఆర్ఎస్ నుంచి 30 మంది వ‌ర‌కు బీజేపీలో చేర‌తార‌ని అంచ‌నా. ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఉనికి ఎక్క‌డా లేదు. క‌నీసం 119 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపే ప‌రిస్థితి కూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే లీడ‌ర్ల మీద బీజేపీ భవిష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.

బండి సంజ‌య్ నాయ‌క‌త్వం కూడా ఇంచుమించు రేవంత్ రెడ్డి త‌ర‌హాలో

రాజకీయ ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌కుండా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు త‌క్ష‌ణం ఈటెల‌ను హ‌స్తిన‌కు ఆహ్వానించారు. ఆయ‌న‌కు ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నారు. అలాగే, డీకే అరుణ‌కు కీల‌క బాధ్య‌త‌ల‌ను ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అలాగే, కొండ విశ్వేశ్వ‌ర‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డి, విజ‌య‌శాంతి జారిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఒక వేళ ఈటెల‌కు ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా ప‌వ‌ర్స్ ఏమీ ఉండ‌దు. బీజీపీ చీఫ్ బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలోనే ప‌నిచేయాలి.అందుకు స‌ముఖంగా ఇత‌ర పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరిన సీనియ‌ర్లు సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ విభాగంకు ఉన్న ఆప్ష‌న్ బండిని మార్చేయ‌డం ఒక్క‌టే క‌నిపిస్తోంది. ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు తీసుకుంటే, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన లీడ‌ర్ల చేతిలోకి పార్టీ వెళ్లిపోతోంది. అందుకే, నాయ‌క‌త్వం మార్పు దాదాపుగా ఉండ‌దు. అంత‌ర్గ‌తంగా కొన్ని మార్పులు మాత్ర‌మే చేసే అవ‌కాశం ఉంది.

Also Read : T BJP : అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు RRR ట‌చ్‌, BRS గ్లామ‌ర్ కు చెక్

కర్ణాటకలో ఓడిపోవడంపై బీజేపీలోని పలువురు నేతల బహిరంగ అసమ్మతిని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కె. కవితను అరెస్ట్ చేయించకుండా అడ్డుకున్నార‌న్న అప‌వాదు బీజేపీ పెద్ద‌ల మీద ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే క్ర‌మంలో అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం నాయకుడు , ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా ముదిరాజ్‌లను నియ‌మించాల‌ని కొంద‌రు కోరుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితి కాంగ్రెస్లోనూ ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మార్చ‌డంతో పాటు సీనియ‌ర్ల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని యోచిస్తోంది. లేదంటే, ఇత‌ర పార్టీల నుంచి లీడ‌ర్లు వ‌చ్చే ఛాన్స్ లేద‌ని భావిస్తోంది. మొత్తం మీద అటు రేవంత్ రెడ్డి ఇటు బండి సంజ‌య్ నాయ‌క‌త్వాల(BJP-Congress) మీద ఉన్న వ్య‌తిరేక‌త `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ` కు అడ్డుగా మారింది.

Also Read : T Congress : కోమ‌టిరెడ్డి సీఎం `రేస్`, యాత్ర‌కు సిద్ధం