Site icon HashtagU Telugu

BJP On Mahesh Bhagwat: రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

Mahesh Bagath

Mahesh Bagath

మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు మునుగోడు గడ్డపై కమలం జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. సీపీ భగవత్ 3 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాచకొండ సీపీపై ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈసీని కలిసినవాళ్లలో నేతల్లో తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ ఉన్నారు.