BJP on KCR : దాడులకు సూత్రధారి కేసీఆర్.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్!

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్, కాదు.. కాదు రాష్ట్ర ప్రభుత్వమే భేషరత్తుగా వరిని కొనాలని బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 11:57 PM IST

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్, కాదు.. కాదు రాష్ట్ర ప్రభుత్వమే భేషరత్తుగా వరిని కొనాలని బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ధర్నాలు, రాస్తారోకోలకు పరిమితమైన రెండు పార్టీలు ఏకంగా దాడులకు దిగడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఆర్జాలబావి దగ్గర ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విజిట్ చేయడానికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరస్పరం రాళ్లు సైతం విసురుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్ రాళ్లు, గుడ్ల దాడి జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనపై సీరియస్ గా స్పందించిన బండి సంజయ్ టిఆర్ఎస్ శ్రేణులు మాపై దాడులు చేయడానికి సీఎం కెసిఆర్ ప్రధాన సూత్రధారి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు. నల్గొండ, మిర్యాలగూడలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు, బండి సంజయ్ కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడి పై సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ బయటకు రారని, ప్రగతి భవన్ కే పరిమితమయ్యారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. చేతగాని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘రారా నాకొడుకా.. ఆరు ముక్కలైతవ్’ అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలకు కారణం నువ్వే.. సమస్యలు వచ్చిందే నీవల్లే.. అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆరుగాలం కష్టపడి వరిని పండించిన రైతులకు బీజేపీ మద్దతు ఇస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు దిగడం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.