Site icon HashtagU Telugu

LS Polls: కేంద్రం సంచలనం నిర్ణయం.. బీజేపీ అభ్యర్థి మాధవి లతకు ‘వై ప్లస్’ కేటగిరీ

Madhavi Latha Vs Owaisi

Madhavi Latha Vs Owaisi

LS Polls: హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవి లతకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. వీఐపీ భద్రతలో భాగంగా ప్రభుత్వం ఆమెకు 11 మంది సిబ్బందితో భద్రత కల్పించింది. ఆమె వెంట ఆరుగురు సీఆర్‌పీఎఫ్‌ భద్రతా అధికారులు రానున్నారు. అలాగే, ఆమె నివాసం వద్ద భద్రత కోసం మరో ఐదుగురు గార్డులు ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join

ఆమెకు భద్రత కల్పించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు ఇప్పటికే పలు లేఖలు రాశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఉన్నప్పుడు కేంద్ర బలగాల భద్రత అవసరమని, అయితే ఆయనకు భద్రత కల్పించలేదని బీజేపీ నేతలు అన్నారు. వీరిద్దరికీ భద్రత కల్పించని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చేరిన మాధవి లతకు భద్రత కల్పించడంతో ఈ విషయం ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీ లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవి లత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ.. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2024 పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. అత్యధిక సీట్లు గెలుచుకోవాలనే వ్యూహంలో హైదరాబాద్ స్థానంలో మాధవి లతను బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసద్ ను ఓడించేందుకు కసరత్తులు చేస్తోంది. అసద్ కు కంచుకోటకు గా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం దక్కించుకోవడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఆసక్తిగా మారనుంది.

Also Read :Alien Fever : మూడు వేళ్లు, పొడవాటి తలతో వింత జీవులు