Site icon HashtagU Telugu

MLC Election: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు

AVN Reddy

Resizeimagesize (1280 X 720) 11zon

ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో (MLC Election) బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సుమారు 1,150 ఓట్ల తేడాతో పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1:40 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగింది. గురువారం అర్ధరాత్రి దాటాక వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు.

Also Read: Record Low Weddings: మూడు పదులు దాటిన పెళ్లికి నో అంటున్న యువత… రికార్డ్ స్థాయిలో పడిపోయిన పెళ్లిళ్లు!

అయితే.. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. ఏ పార్టీ అభ్యర్థికీ సరైన మెజార్టీ రాలేదు. అంటే 50 శాతం మించి ఓట్లు పడలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది. వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.