BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం అగ్ర నేతలను దించుతున్న బిజెపి

20వ తేదీన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణలో పర్యటించనున్నారు. 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఇంకా.. 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 02:01 PM IST

తెలంగాణ ఎన్నికలను బిజెపి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా తెలంగాణ లో కాషాయ జెండా (BJP) ఎగరాల్సిందే అని పట్టుదలతో ఉంది. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్రతి రోజు జిల్లాల్లో భారీ సభలు నిర్వహిస్తూ ఓటు వేయాలని కోరుకుంటూ..తమ మేనిఫెస్టో లను తెలియజేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇటు కాంగ్రెస్ సైతం ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. ఈరోజు రాహుల్ (Rahul , ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లో బస్సు యాత్ర (Congress Bus Yatra) చేపట్టబోతున్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ హావ కూడా బాగా పెరిగింది. ఇలా ఎటు చూసిన ఈ రెండు పార్టీలు దూకుడు చూపిస్తుండడం తో బిజెపి సైతం దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈరోజు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో మొదటి జాబితాను ఖరారు చేయనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌లు ఢిల్లీ వెళ్లడం జరిగింది. 40-50 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను రిలీజ్ చేయబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఎన్నికల ప్రచారం కోసం బిజెపి అగ్ర నేతలను రంగంలోకి దించబోతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath), స్మృతీ ఇరానీ (Smriti Irani), హింత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) లు ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో మొదటి విడతగా వీరు రాష్ట్రానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ తాజాగా విడుదల చేసింది. 20వ తేదీన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణలో పర్యటించనున్నారు. 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఇంకా.. 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 31న యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు.

Read Also : BRS Minister: నిర్మ‌ల్ లో ఎన్నిక‌ల సమరశంఖం పూరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి