Site icon HashtagU Telugu

Ayodhya Trains : తెలంగాణ టు అయోధ్య.. 17 రోజులు బీజేపీ ప్రత్యేక రైళ్లు ఇవే..

Ayodhya Trains

Ayodhya Trains

Ayodhya Trains : సామాన్య భక్తులకు ఈరోజు నుంచి అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను ఫ్రీగా అయోధ్య యాత్రకు తీసుకెళ్లేందుకు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘ఆస్థా’ పేరుతో ప్రత్యేక రైళ్లను(Ayodhya Trains) నడపనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందిని ఇందుకోసం ఎంపిక చేస్తారు. ఆస్థా ప్రత్యేక రైళ్లను కాజీపేట, సికింద్రాబాద్‌ నుంచి నడుపుతారు. ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. ప్రతి బోగికి ఒక ఇంఛార్జిని నియమించారు. అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల టైం పడుతుంది. అయోధ్యకు వెళ్లే ఉచిత రైళ్ల షెడ్యూల్‌ను బీజేపీ ప్రకటించింది. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, నియోజకవర్గాలకు చెందిన వారు కాజీపేటలో ఆయా తేదీల్లో అందుబాటులో ఉండే రైలు ఎక్కాలి.

We’re now on WhatsApp. Click to Join.

నియోజకవర్గాలు – రైళ్లు బయలుదేరే తేదీలు

Also Read: KVP : రంగంలోకి రాజకీయ మాంత్రికుడు.. వైసీపీ అసంతృప్తులు టార్గెట్‌గా వ్యూహరచన

రాముడిని చూడకుండా.. పూజారి ముఖం ఎందుకు కప్పుకున్నాడు..!

అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో.. శ్రీరాముడిని చూడకుండా ఓ పూజారి తన ముఖానికి దుప్పటా కప్పుకున్నాడు.. ఎందుకు ఇలా చేశారు అనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నలు.. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చనీయాంశం అయ్యింది.. ఈ విషయంపై కర్నాటకకు చెందిన ఓ ప్రముఖ పూజారి వివరణ ఇచ్చారు.. అదేంటో తెలుసుకుందాం.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక నుండి ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఆసక్తికరమైన ఫొటోలో, ఉడిపికి చెందిన పెజావర్ మఠాధీశ స్వామి విశ్వప్రసన్న తీర్థ అనే పూజారి ఆచారాల సమయంలో తన ముఖాన్ని కప్పుకుని కనిపించారు. గర్భ గుడిలో ఉన్న కెమెరాకు చిక్కిన ఈ సంఘటన..  ఆయనలా ప్రవర్తించడంపై చర్చలకు ప్రేరేపించింది. స్వామి విశ్వప్రసన్న తీర్థ తన ముఖాన్ని కప్పి ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది రాముడికి పవిత్ర నైవేద్యాన్ని సమర్పించే సమయంలో జరిగింది. ఈ చిత్రం స్వామికి దైవంతో ఉన్న లోతైన సంబంధాన్ని, దేవుని పట్ల ఆయనకున్న అత్యంత గౌరవాన్ని సూచిస్తోంది. ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా చూసిన సహనా సింగ్ అనే X యూజర్ తన ఖాతాలో ఈ క్షణం చిత్రాన్ని పంచుకున్నారు. స్వామి విశ్వప్రసన్న తీర్థ చేసిన ఈ పని ప్రాముఖ్యతను ఆమె ఎత్తిచూపారు. ఇది నైవేద్యం సమర్పించినప్పుడు రాముని పట్ల భక్తి, గౌరవానికి సంకేతమని చెప్పుకొచ్చారు.