BJP-BRS : మంత్రి, ఎమ్మెల్యే మ‌ధ్య భూ భాగోతం

ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు(BJP-BRS) స‌హ‌జం. చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ, ప్ర‌జాక్షేత్రంలోనూ

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 02:07 PM IST

రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు(BJP-BRS) స‌హ‌జం. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి ఇదో జిమ్మిక్కు. చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ, ప్ర‌జాక్షేత్రంలోనూ లీడ‌ర్లు త‌ర‌చూ చేసే ఆరోప‌ణ‌ల‌కు(Blame game) ఎవ‌రూ ఆధారాలు చూప‌రు. తాజాగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌ల పేప‌ర్లు లీకు సంద‌ర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌లు ఆరోప‌ణ‌లు ప్ర‌భుత్వం మీద చేశారు. ప్ర‌తిగా తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. ఆధారాల‌ను చూపాల‌ని విచార‌ణ‌కు పిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదో కొత్త పోక‌డ‌. ఇక వ్య‌క్తిగ‌తంగా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, దేవాల‌యాల‌కు వెళ్లి ప్ర‌మాణాలు చేయ‌డం రాజ‌కీయ నేత‌ల మ‌రో ఎత్తుగ‌డ‌.

రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు(BJP-BRS)

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు ఎన్నిక‌ల సందర్భంగా 25కోట్లు బీఆర్ఎస్ నుంచి తీసుకున్నాడ‌ని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర చేసిన ఆరోప‌ణ‌(Blame game). దాన్ని నిరూపించాల‌ని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. అంత‌టితో ఆగ‌కుండా 25కోట్లు తీసుకోలేద‌ని భాగ్య‌ల‌క్ష్మీ దేవాలయం వ‌ద్ద ప్ర‌మాణం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు, ఆధారాలుంటే తీసుకున్నామ‌ని ప్ర‌మాణం చేయ‌డానికి దేవాల‌యానికి రావాల‌ని ఈటెల‌కు స‌వాల్ చేశారు. ఇలాంటి సంఘ‌ట‌నలు ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో త‌ర‌చూ ఇటీవ‌ల చూస్తున్నాం. తాజాగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారం (BJP-BRS) తెర మీద‌కు వ‌చ్చింది.

మంత్రి నిరంజ‌న్ రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారాన్ని..

పాద‌యాత్ర సంద‌ర్భంగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల కూడా మంత్రి నిరంజ‌న్ రెడ్డి అక్ర‌మాల‌పై ఆరోప‌ణ‌లు(Blame game) చేశారు. ఆ సంద‌ర్భంగా ఆమెను మ‌ర‌ద‌లంటూ సంభోదించ‌డం అప్ప‌ట్లో వివాదం అయింది. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యాప‌ణ‌లు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా స‌ర్దుకున్నాయి. ఇప్పుడు మంత్రి నిరంజ‌న్ రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు వెలుగెత్తుతున్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో 80 ఎక‌రాల ఫాంహౌజ్ ఉన్న నిరంజ‌న్ రెడ్డి ప‌క్క‌నే ఉన్న మ‌రో 80 ఎక‌రాల‌ను ఆక్ర‌మించార‌ని ఆరోప‌ణ‌. మొత్తం 160 ఎకరాల‌ను మంత్రి నిరంజ‌న్ రెడ్డి రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడ‌ని ర‌ఘునంద‌న్ చేస్తోన్న తీవ్ర‌మైన విమ‌ర్శ‌. అందుకు ఆధారాలు కూడా చూపుతాన‌ని స‌వాల్ (BJP-BRS)చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌వాళ్లు ఇప్పుడు నువ్వా? నేనా? అనే స్థాయికి వివాదం(BJP-BRS)

రెండు రోజుల నుంచి వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రుగుతోన్న ఆరోప‌ణ‌లు, స‌వాళ్లు ఇప్పుడు నువ్వా? నేనా? అనే స్థాయికి(BJP-BRS) వివాదం వ‌చ్చింది. భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఆధారాలు చూపాల‌ని ర‌ఘునంద‌న్ కు మంత్రి ఛాలెంజ్ చేశారు. ప‌త్రాల‌ను చూపించ‌డానికి ఎక్క‌డికైనా, ఎప్పుడైనా రావ‌డానికి సిద్ధ‌మంటూ దుబ్బాక ఎమ్మెల్యే సిద్ధ‌మ‌య్యారు. ఇక టైం, ప్లేస్ చెప్ప‌డమే మంత్రి నిరంజ‌న్ కు మిగిలి ఉంది. ప్ర‌భుత్వ భూమిని ఆక్రమించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన ఇద్దరు ఎన్నారై కుమార్తెలు ఈ భూములను కొనుగోలు చేశారని మంత్రి చెబుతున్నారు.

2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారని బీఆర్ఎస్ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు చెబుతోన్న‌ భూముల వివ‌రాల‌ను 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారని బీఆర్ఎస్ మంత్రి నిరంజ‌న్ రెడ్డి (Blame game)చెబుతున్నారు. “నా భార్య బ్యాంకు రుణంతో పాటు ఆమె సొంత డబ్బుతో ఫామ్‌హౌస్‌లో ఇల్లు నిర్మించింది” అని రెడ్డి చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తన ఇద్దరు కూతుళ్లు సురవరం ప్రతాప్ రెడ్డి తదితరుల వారసుల నుంచి భూమిని కొనుగోలు చేశారని మంత్రి వివ‌రిస్తున్నారు.
ఈ భూములను ఎస్టీల పేర్ల మీద రిజిస్టర్ చేసి, ఆ తర్వాత త‌న‌ కుటుంబసభ్యుల పేర్ల మీదకు బదలాయించారని రఘునందన్ అన్నారు. దానికి సమాధానంగా అనాథగా ఉన్న గౌడ్ నాయక్ చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడని వనపర్తి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. పూర్తి విద్యను అభ్యసించాడు.అతను ఉన్నత చదువులు చదివాడు.అతను మా కుటుంబ సభ్యుడి లాంటివాడు అంటూ మంత్రి ఏదో వివ‌ర‌ణ ఇస్తున్నారు.

Also Read : BRS Issue : తాండూర్ చ‌ద‌రంగం, బీఆర్ఎస్ కు పైలెట్ పోటు

భూ యజమానులతో మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిర్దిష్ట వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేయాలి. కోవిడ్ పరిమితుల కారణంగా నా కుమార్తెలు రాలేకపోయార‌ని, ఆ కారణంగా గూడా నాయక్ పేరు మీద పెట్టాల్సి వ‌చ్చిందని మంత్రి చెబుతున్నారు. ఆ త‌రువాత కుమార్తెల పేరు మీద‌కు మారింద‌ని ఏదేదో దాట‌వేసే మాట‌లు వినిపిస్తున్నారు. ఎన్నారైలుగా ఉన్న మంత్రి కుమార్తెలు నిషేధించబడిన వ్యవసాయ భూమిని ఎలా కొనుగోలు చేశారనే ప్రశ్నలు తలెత్తడంతో మంత్రి ప్ర‌క‌ట‌న‌ మరో వివాదానికి (BJP-BRS) దారితీసింది. ఇలా బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్, మంత్రి నిరంజ‌న్ రెడ్డి మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల మ‌ధ్య(Blame game) రాజ‌కీయం హీటెక్కింది.

Also Read : YCP- BJP : బంధానికి గండి! జ‌గ‌న్ స‌ర్కార్ కు మూడిన‌ట్టే?