BJP-BRS: అప్పుడు వ‌రి ఇప్పుడు లిక్క‌ర్,`కిక్`ఎక్కించే దీక్ష‌లు

బీజేపీ, బీఆర్ఎస్ (BJP-BRS)ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు కౌంట‌ర్ల‌కు సిద్ధ‌మ‌య్యారు.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 05:25 PM IST

ఎన్నిక‌ల ఏడాది ఏ మాత్రం త‌గ్గ‌కుండా బీజేపీ, బీఆర్ఎస్ (BJP-BRS)ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు కౌంట‌ర్ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్(liquor scam) క‌ల్వ‌కుంట్ల కుటుంబం చుట్టూ తిరుగుతోంది. దాన్ని బీజేపీ పార్టీ క‌క్ష సాధింపు దిశ‌గా మ‌ల‌చ‌డానికి బీఆర్ఎస్ నోరు పెద్ద‌గా చేసుకుంది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల కోసం ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగే క‌విత‌కు పోటీగా బీజేపీ ఆఫీస్ లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దీక్ష‌కు పూనుకున్నారు. తెలంగాణ‌లో పెరిగిన బెల్డ్ షాపుల‌కు నిర‌స‌న‌గా ఈ దీక్ష చేస్తున్నారు.

క‌విత‌కు పోటీగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి దీక్ష‌(BJP-BRS)

లిక్క‌ర్ స్కామ్ లో(liquor scam పీక‌ల్లోతుకు వెళ్లిన క‌విత‌ను బ‌య‌ట ప‌డేసేందుకు కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గ స‌మావేశంలోనూ ఈ విష‌యం చ‌ర్చించారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల‌లో ఈడీ, సీబీఐ ప్ర‌త్య‌ర్థుల మీద చేసిన దాడుల జాబితాను బీఆర్ఎస్ త‌యారు చేస్తోంది. ఏ మాత్రం త‌ప్పు చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ క‌విత‌ను ఈడీ, సీబీఐ వేధిస్తుంద‌న్న కోణం నుంచి ఇష్యూను తీసుకెళ్ల‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేశారు. అందుకు ప్ర‌తిగా బీజేపీ కూడా తొమ్మిదేళ్ల కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన ఆకృత్యాలు, వేధింపులు, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను నిర్వీర్యం ఎలా చేశారు? అనే దానిపై జాబితాను త‌యారు చేస్తున్నారు. దేశ స్థాయిలో మోడీని టార్గెట్ చేస్తుంటే, రాష్ట్ర స్థాయిలో క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని బీజేపీ (BJP-BRS) ల‌క్ష్యంగా చేసుకుని ముందుకెళుతోంది.

Also Read : MLC Kavitha: మార్చి 11న విచారణకు ఎమ్మెల్సీ కవిత.. స్పష్టం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌

ఈడీ నోటీసులు వ‌స్తాయ‌ని ముందుగా తెలుసుకున్న క‌ల్వ‌కుంట్ల కుటుంబం క‌విత‌ను మ‌హిళా రిజ‌ర్వేష‌న్ (liquor scam)పోరాటం దిశ‌గా న‌డిపించింది. మాట‌కారిగా పేరున్న ఆ కుంటుంబంలోని క‌విత ఢిల్లీ వెళ్లారు. మీడియా ముందు ధైర్యం కూర్చుకున్నారు. ఈడీని ఎదుర్కుంటాన‌ని ధీమా వ్య‌క్త‌ప‌రిచారు. అంతేకాదు, జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష‌కు ప్లేస్ ఇవ్వ‌లేద‌ని బీజేపీని టార్గెట్ చేశారు. ఏర్పాట్ల‌కు దిగిన స‌మ‌యంలో మ‌రో ప్లేస్ కు మార్చాల‌ని ఢిల్లీ పోలీసులు కోరిన‌ట్టు చెప్పారు. ఆ అంశాన్ని కూడా రాజ‌కీయ కోణం నుంచి క‌విత తీసుకెళ్లారు. అయితే, దీక్ష మాత్రం ఉంటుంద‌ని చెబుతూ, 11వ తేదీన ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని చెబుతున్నారు. మ‌రో వైపు మంత్రి కేటీఆర్ సోద‌రి క‌విత కోసం మీడియా ముందుకొచ్చారు. ఆదానీ. ఇష్యూతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ఈడీ, సీబీఐ కేసుల‌ను ఎదుర్కొన్న వాళ్ల జాబితాను ముందుకు తీసుకొచ్చారు. వాళ్ల‌లో ఎంద‌రు బీజేపీ గూటికి చేరారు? అనేది కూడా బ‌య‌ట పెట్టారు.

క‌విత‌ మ‌హిళా రిజ‌ర్వేష‌న్  పోరాటం 

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను వీలున్నంత రాజ‌కీయం చేయ‌డానికి ఇరు పార్టీలు వ్యూహాలు ర‌చించుకున్నాయి. విచిత్రంగా విప‌క్షాలు కూడా క‌విత లిక్క‌ర్ స్కామ్ మీద మండిప‌డుతున్నాయి. ఆమె సారా వ్యాపారం చేస్తూ తెలంగాణ‌కు ఇష్యూను ముడిపెడుతున్నార‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు, ఉద్య‌మకారులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ స‌మాజం క‌విత వైపు ఉండేలా క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప్లాన్ చేస్తోంది. ప్ర‌తిగా తెలంగాణ‌కు ఎలా ముడిపెడ‌తార‌ని అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. సారా వ్యాపారం ద్వారా. తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా సంపాదిస్తుంది? అనేది కూడా బ‌య‌ట పెట్ట‌డానికి బీజేపీ దీక్ష‌కు దిగింది. శుక్ర‌వారం రోజు ఢిల్లీ కేంద్రం క‌విత‌, హైద‌రాబాద్ కేంద్రంగా బీజేపీ నేత‌ల దీక్ష‌లు (BJP-BRS) జ‌ర‌గ‌బోతున్నాయి. ఇక ఇరు పార్టీల లీడ‌ర్లు దీక్ష‌ల సంద‌ర్భంగా చేసుకునే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు రాబోవు ఎన్నిక‌ల‌కు ప‌సందుకానున్నాయి.

వ‌రి కొనుగోలు త‌ర‌హాలో ఈ స్కామ్ మీద ఇరుపార్టీలు డ్రామా  

ముచ్చింత‌ల్ రామానుచార్యులు విగ్ర‌హం వ‌ద్ద ఏర్ప‌డిన ప్రోటోకాల్ వివాదం కేసీఆర్, మోడీ (BJP-BRS) మ‌ధ్య అంత‌రాన్ని పెంచింది. ఆ రోజు నుంచి మోడీ తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసీఆర్ మొఖం చాటేస్తూ వ‌చ్చారు. ఆ త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యాన్ని అస్త్రంగా ఎంచుకుని కేసీఆర్ ఢిల్లీ మీద గురిపెట్టారు. గ‌త ఎనిమిదేళ్లుగా లేని వ‌రి కొనుగోలు అంశాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ప్ర‌జాక్షేత్రంలోకి దిగాయి. ఇదంతా ఆ రెండు పార్టీల డ్రామాగా కాంగ్రెస్ చెబుతోంది. కానీ, ఇప్పుడు లిక్క‌ర్ స్కామ్(liquor scam) వ్య‌వ‌హారం వ‌చ్చింది. వ‌రి కొనుగోలు త‌ర‌హాలో ఈ స్కామ్ మీద ఇరుపార్టీలు డ్రామాలు ఆడ‌తారా? ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడ‌తారా? నిజంగా క‌విత‌ను అరెస్ట్ చేస్తారా? అనేది సందిగ్ధం. మొత్తం మీద రాజ‌కీయానికి కిక్ ఎక్కించేలా శుక్ర‌వారం బీజేపీ, బీఆర్ఎస్ వ్య‌వ‌హారం ఉండ‌బోతుంద‌న్న‌మాట‌.

Also Read : BRS Kavitha :ఆర్థిక పాపం పండింది!ED బేడీల వేళ నారీభేరీ!