Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కలయిక రాజకీయాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ఆయన.. భారతీయ జనతా పార్టీ (BJP) – భారత రాష్ట్ర సమితి (BRS) మధ్య పొత్తు మొదలైందని సంచలన ఆరోపణలు చేశారు.
సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, ‘‘రాష్ట్రంలో BRS కు BJP మద్దతు, కేంద్రంలో BJP కు BRS మద్దతు – ఇదే ఈ రెండు పార్టీల మధ్య ఒప్పంద సారాంశం’’ అంటూ అన్నారు. అంతేకాదు, “ఇదే ఒప్పందం నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి” అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షునిగా రామచందర్ రావు నియామకం జరగనున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. పార్టీలో ఎక్కువకాలంగా ఉన్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుండటంతో రామచందర్ రావు ఎంపిక జరగనుందని సమాచారం. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
BRS తో బీజేపీ జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ రహస్య పొత్తులో ఉంది అనే ఆరోపణలు కాంగ్రెస్ నేతల నుంచి పునరావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా సామ రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ తాజా రాజకీయ పరిణామాలు తెలంగాణలో వచ్చే ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తున్నాయి. BRS – BJP పొత్తు నిజమే అయితే, కాంగ్రెస్ వ్యూహాలకు ఇది సవాలుగా మారుతుందా చూడాలి.
Minister Narayana : రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు
BJP – BRS పొత్తు కు తొలి అడుగు పడింది..
రాష్ట్రం లో BRS కు BJP, కేంద్రంలో BJP కి BRS మద్దతు..
ఇదే ఒప్పంద సారాంశం.అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా రామచందర్ రావు నియామకం జరగనుంది.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న రెండు పార్టీలు.
BJP=BRS@BJP4Telangana =… pic.twitter.com/T91eQZ4xHu— Sama Ram Mohan Reddy (@RamMohanINC) June 30, 2025