BJP-BRS : తెలంగాణ‌పై మోడీ షెడ్యూల్! `ఫూల్స్ వార్` హీట్‌!

బీఆర్ఎస్, బీజేపీ(BJP-BRS) మ‌ధ్య తెలంగాణ రాజ‌కీయ వార్ తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ ఒక‌టో తేదీ

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 05:04 PM IST

బీఆర్ఎస్, బీజేపీ(BJP-BRS) మ‌ధ్య తెలంగాణ(Telangana) వ్యాప్తంగా రాజ‌కీయ వార్ తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ ఒక‌టో తేదీ సంద‌ర్భంగా ప‌ర‌స్ప‌రం ఫూల్స్ ను చేసుకుంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా పోస్టులు పెట్టారు. మోడీ ఇచ్చిన హామీల‌ను బీఆర్ఎస్ పోస్ట‌ర్ గా మార్చి ట్వీట్ చేసింది. తెలంగాణ నిరుద్యోగుల‌కు కేసీఆర్ ఇచ్చిన హామీని వినూత్నంగా చూపుతూ చేసిన ట్వీట్ ఆ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వైరాన్ని తెలియ‌చేస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌కు తెలంగాణ‌కు మోడీ వ‌స్తే పోస్ట‌ర్ల ద్వారా గో బ్యాక్ మోడీ స్లోగ‌న్ ల‌ను బీఆర్ఎస్ వినిపించింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాంటీ మోడీ పోస్ట‌ర్లు ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ వెలుస్తున్నాయి. దానికి నాంది బీఆర్ఎస్ పార్టీ ప‌లికింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

బీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య  ఫూల్స్  వార్ (BJP-BRS)

రాజ్యాధికారం కోసం బీజేపీ తెలంగాణ(Telangana) మీద క‌న్నేసింది. ఆ దిశ‌గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు దూకుడుగా వెళుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన టీఎస్ పీఎస్స్ పేప‌ర్ లీకేజి అంశాన్ని క్షేత్ర‌స్థాయికి తీసుకెళ్లిది. రాష్ట్ర ప్ర‌భుత్వం వాల‌కాన్ని దుయ్య‌బ‌ట్టింది. తెలంగాణ స‌మాజంలో కేసీఆర్ ప్ర‌భుత్వ బ‌ల‌హీన‌త‌ల‌ను ఎత్తిచూపింది. అదే స‌మ‌యంలో మోడీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ర్యాంకింగ్ చేస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బీఆర్ఎస్ చేస్తోన్న ర్యాగింగ్ నేరుగా మోడీని (BJP-BRS)టార్గెట్ చేసింది. తెలంగాణ నిధుల‌కు, అభివృద్ధి ఆగిపోవ‌డానికి కేంద్రాన్ని కార‌ణంగా చూపుతూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా. మెట్రో రైలు ప్రాజెక్టు మూడో విడ‌త అప్రూల్ విష‌యంలోనూ మోడీని ల‌క్ష్యంగా బీఆర్ఎస్ చేసుకుంది. జాతీయ స్థాయిలో మోడీని అభాసుపాలు చేయ‌డానికి కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌లు పెడుతున్నారు.

ప్ర‌తి నెలా ఒక‌సారి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌కు వ‌చ్చేలా ప్లాన్

ఇక బీజేపీ మాత్రం రాజ్యాధికారం దిశ‌గా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. పోలింగ్ బూతుల వారీగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు కూడా తెలంగాణ(Telagana) వైపు సీరియ‌స్ గా చూస్తోంది. ప్ర‌తి నెలా ఒక‌సారి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌కు వ‌చ్చేలా ప్లాన్ చేశారు. నాలుగు నెల‌ల పాటు ప్ర‌తి నెలా రావ‌డానికి షెడ్యూల్ చేసుకున్నార‌ని తాజాగా తెలుస్తోంది. అలాగే, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు పార్ల‌మెంట్ నియోక‌వ‌ర్గాల వారీగా ప‌ర్య‌టించ‌డానికి స‌న్నద్ధం అయ్యారు. ప్ర‌తి నెలా కేంద్ర మంత్రులు విజిట్ చేసేలా బ్లూ ప్రింట్ త‌యారు చేశారు. ఏ మాత్రం బీఆర్ఎస్ కు (BJP-BRS)అవ‌కాశం ఇవ్వ‌కుండా ఆ పార్టీని ఓడించాల‌ని మోడీ, అమిత్ షా ద్వ‌యం ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read : BRS Leader Died: ఆత్మీయ సమ్మేళనంలో హఠాన్మరణం, గుండెపోటుతో BRS నేత మృతి!

సాధార‌ణంగా మోడీ, అమిత్ షా ద్వ‌యం టార్గెట్ చేస్తే ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. ఆ విష‌యం యూపీ, గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు క‌ర్ణాట‌క మీద ఫోక‌స్ పెట్టారు. ఆ త‌రువాత తెలంగాణ (Telangana) మీద వాలిపోనున్నారు. క‌ర్ణాట‌క‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌డానికి బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు, యుక్తులు ఒడ్డుతోంది. యూపీ త‌ర‌హా ఫార్ములాతో క‌ర్ణాట‌క‌ను కైవ‌సం చేసుకోవ‌డానికి ప్లాన్ చేస్తోంది. అక్క‌డున్న జేడీఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. అదే త‌ర‌హాలో తెలంగాణ మీద కూడా బ్లూ ప్రింట్ ను త‌యారు చేసింది. ఈనెల 8వ తేదీన హైద‌రాబాద్ కు వ‌స్తోన్న మోడీ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ గురించి క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఆ రోజునవందేభార‌త్ రైలును ప్రారంభించ‌డంతో పాటు ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తారు. ఆ త‌రువాత బీజేపీ తెలంగాణ విభాగానికి డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఆయ‌న ఇచ్చే దిశానిర్దేశం త‌రువాత తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీ(BJP-BRS) దూకుడు మ‌రింత పెర‌గ‌నుంది.

Also Read : Rahul Disqualified : విప‌క్షాలు ఏకం! కాంగ్రెస్ తో TMC, BRS!!