BJP-BRS Game : తెర‌చాటు వ్య‌వ‌హారానికి మోడీ ముగింపు.!

BJP-BRS Game : ప్ర‌ధాని మోడీ చేసిన లీకులు వెనుక ఆంత‌ర్యం ఏమిటి? నిజంగా కేసీఆర్ ఎన్డీయేలో క‌ల‌వాల‌ని అనుకున్నారా?

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 02:32 PM IST

BJP-BRS Game : ప్ర‌ధాని మోడీ చేసిన లీకులు వెనుక ఆంత‌ర్యం ఏమిటి? నిజంగా కేసీఆర్ ఎన్డీయేలో క‌ల‌వాల‌ని అనుకున్నారా? నిజామాబాద్ స‌భ‌లోనే ఎందుకు లీకులు ఇచ్చారు? బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఏమి జ‌రుగుతుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రెండు పార్టీల మ‌ధ్య ఏదో జ‌రుగుతుంది? అనే అనుమానం ఉండేది. నిజామాబాద్ స‌భ‌లో మోడీ విప్పిన సీక్రెట్ తో ఏదో జరిగింది అనేది స్ప‌ష్టం అయింది. ఆ రెండు పార్టీల మ‌ధ్య 2014 నుంచి స‌ఖ్య‌త ఉంది. ముచ్చింత‌ల్ రామానాజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ వ‌ర‌కు మోడీ, కేసీఆర్ ఒక‌టేలా మెలిగారు. రాష్ట్రంలోని అభివృద్ధిని ప్ర‌శంసిస్తూ ప‌లు అవార్డులు, రివార్డుల‌ను కూడా గ‌తంలో కేంద్రం ప్ర‌క‌టించింది. వాటిని చూప‌డం ద్వారా 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చారు.

మోడీ చెప్పిన ర‌హ‌స్యంపై..(BJP-BRS Game)

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత జ‌రిగిన 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఇద్ద‌రు ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితోనే ఉన్నారు. పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ప‌లు కీల‌క నిర్ణ‌యాల విష‌యంలోనూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకున్నారు. దీంతో ఎన్డీయేలో భాగ‌స్వామ్యంగా టీఆర్ఎస్ మారుతుంద‌ని (BJP-BRS Game) అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. కేంద్ర క్యాబినెట్లో క‌విత‌కు స్థానం ల‌భించ‌నుంద‌ని కూడా కల్వ‌కుంట్ల అభిమానుల్లో చ‌ర్చ జ‌రిగింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుకు కూడా ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ఇచ్చిన కేసీఆర్ ముచ్చింత‌ల్ ప్రొటోకాల్ ఎపిసోడ్ త‌రువాత యూ ట‌ర్న్ తీసుకున్నారు. ఆ రెండు పార్టీలు గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు మాట‌ల యుద్ధాన్ని ప్ర‌క‌టించాయి. అదంతా గేమ‌ని కాంగ్రెస్ ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూ వ‌చ్చింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ , ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు

తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ , ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇరు పార్టీల‌కు చెందిన లీడ‌ర్లు ప‌ర‌స్ప‌రం ఆ రెండు కేసుల మీద తీవ్రంగా ఆరోపించుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, ఆ రెండు కేసుల్లోనూ ఇద్ద‌రూ బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌ధాని మోడీతో కేసీఆర్ లైజ‌నింగ్ చేసుకున్నారా? ఫాంహౌస్ కేసు నుంచి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి బీఎల్ సంతోష్ ను బయ‌టేసేందుకు కేసీఆర్ తో బీజేపీ మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రిస్తుందా? అనే సందేహం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. దానికి స‌మాధానం కావాల‌ని బీజేపీలోని సీనియ‌ర్లు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, ఈటెల త‌దితరులు అధిష్టానం వ‌ద్ద మొర‌పెట్టుకున్నార‌ని ప్ర‌చారం ఉంది. కానీ, ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త ఉంద‌ని (BJP-BRS Game) కాంగ్రెస్ చెబుతోంది. ఇదే స‌మ‌యంలో మోడీ మాత్రం కేసీఆర్ కు సంబంధించిన లీకుల‌ను బ‌య‌ట పెట్ట‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిటి? అనేది మాత్రం పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలింది.

Also Read : Minister Roja : ఎన్టీఆర్ ఎపిసోడ్ కు మంత్రి రోజా `బ్లూ ఫిల్మ్` ముడి..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను న‌మ్మ‌డానికి అవ‌కాశం ఉంద‌ని బీజేపీ లీడ‌ర్ విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. అంతేకాదు, 2009లో జ‌రిగిన లూథియానా సంఘ‌ట‌న‌ను ఆమె కోడ్ చేశారు. ఆ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌క‌ముందే, లూథియానాలో జ‌రిగిన ఎన్డీయే ర్యాలీకి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలో యూపీఏ ప‌క్షాల‌తో కూట‌మిగా ఏర్ప‌డిన కేసీఆర్ కేంద్రంలో ఎన్డీయేతో క‌లిసేందుకు ఆ ర్యాలీకి వెళ్లార‌ని విజ‌య‌శాంతి గుర్తు చేస్తూ, మోడీ నిజామాబాద్ వేదిక‌గా చెప్పిన మాటల్లో నిజం లేక‌పోలేద‌ని వివ‌రించారు. ఆ స‌భ‌లో మోడీ చెప్పిన దాని ప్రకారం, కేటీఆర్ ను సీఎం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన మాట వాస్త‌వ‌మే. ఆ విష‌యాన్ని మోడీతో షేర్ చేసుకుని ఉండొచ్చు. ఇక ఎన్డీయేలో భాగ‌స్వామిగా కావాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నం చేసినట్టు అప్ప‌ట్లో న్యూస్ గుప్పుమంది. దాన్ని కూడా నమ్మొచ్చు. కానీ, భాగ‌స్వామిగా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని మోడీ చెప్పిన ర‌హ‌స్యంపై మాత్రం కొంత సందేహం ఉంది. ఏదేమైనా, మోడీ, కేసీఆర్ న‌డుమ ప‌దేళ్లుగా ఏదో న‌డుస్తుంది? అనే అనుమానానికి మోడీ తెర‌దించార‌న్న‌మాట‌.

Also Read : BRS Master Strategy : కాంగ్రెస్ ఓట్ల‌పై జ‌న‌సేన‌, బీఎస్పీ, ఎంఐఎం గురి