నవంబర్ 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ (BC Atma Gourava Sabha) నిర్వహించబోతున్నట్లు..ఈ సభ కు ప్రధాని మోడీ (PM Modi) హాజరుకానున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (BJP MP Laxman) తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. బీజేపీ మాత్రం కాస్త వెనకపడింది. సగం మందికి పైగా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీనికి తోడు కీలక నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో మళ్లీ జోష్ నింపేందుకు బిజెపి భారీ స్కెచ్ వేసింది.
ఈ నెల 07 హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ సభకు ప్లాన్ చేసారు. బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటీకే ప్రకటించిన బిజెపి..ఇప్పుడు ఈ సభ ద్వారా ప్రధాని మోడీ చేత ప్రకటించాలని చూస్తుంది. అలాగే బీసీ సీఎం మాత్రమే కాదు.. అభ్యర్థుల ఎంపికలోనూ బిజెపి ఆచితూచి వ్యవహరిస్తోంది. బీసీ అభ్యర్థులకు పెద్ద పీట వేస్తూ.. ఇతర పార్టీల్లా కాకుండా.. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా.. బీసీ ఓట్లను రాబట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె నేడు మీడియా తో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫై , రాహుల్ గాంధీ ఫై పలు విమర్శలు చేసారు. రాహుల్ గాంధీ బీసీలను అవమానపరిచారన్నారు. అవకాశం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీసీలు బీజేపీకి (BJP) దగ్గరవుతారన్న అక్కసుతో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారని విమర్శించారు. బీసీలు తమకున్న ఓటు ఆయుధంతో రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు (CM KCR) చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు (BRS) ప్రకటించే తాయిలాల కోసం తాము ఆరాటపడడం లేదని బీసీలు నిరూపించుకోవాలన్నారు. బీసీలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.
జనసేన (Janasena) తమ భాగస్వామ్య పార్టీ అని అన్న లక్ష్మణ్ పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులుంటాయని తెలిపారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేయనున్నారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వ్యూహం వల్లనే గెలిచామని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని, పొత్తుల్లో కొన్ని సీట్లు భాగస్వామ్య పార్టీలకు ఇస్తామన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాలకే కాదు దేశ ప్రయోజనాలను కూడా తమ పార్టీ చూస్తుందని లక్ష్మణ్ తెలిపారు.
Read Also : Chandrababu : చంద్రబాబు ఫై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు