Lok Sabha Polls 2024: తెలంగాణ బీజేపీ లోకసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వంపై బీజేపీ హైకమాండ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మెదక్ నుంచి రఘునందన్ రావు, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్ ఉన్నారట.. అంతేకాక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లను జేపీ నడ్డా, అమిత్ షాలు ఆమోదించినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిసింది.
ఈ నెల 29న జరగనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో పోయిన స్థానాల్లో పార్టీ బలం పెరిగిందని ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు పార్టీ నేతలకు వివరించినట్లు సమాచారం.
రాష్ట్రంలో 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ఐక్యతతో పని చేయాలని వారు రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలిసింది. సమావేశంలో పార్టీ నాయకులు బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.
Also Read: Operation Valentine : ఆపరేషన్ వాలెంటైన్ అందరు చూడాల్సిన చిత్రం – చిరంజీవి